Headlines

ట్రిపుల్ కెమెరా, సెకండరీ డిస్‌ప్లే! మతిపోగొట్టే ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్​ఫోన్​ | Stunning Smartphone Launch: Get Ready For Tecno Pova 8 Pro 5G


గ్లోబల్ మార్కెట్లో దుమ్మురేపుతున్న ప్రముఖ టెక్నో సంస్థ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదల కానుంది. ఆగస్టు 18న ఈ హ్యాండ్​సెట్ అధికారికంగా లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది. వెనుక వైపు ప్రత్యేకమైన సెకండరీ స్క్రీన్, పవర్​ఫుల్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ అద్భుతమైన డివైజ్ టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సెకండరీ డిస్‌ప్లే

ఈ కొత్త హ్యాండ్​సెట్లో ప్రధాన ఆకర్షణ దీని యూనిక్ లుక్. వెనుక వైపు కెమెరా మాడ్యూల్ పక్కన ‘అలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే’ పేరుతో ఒక సెకండరీ స్క్రీన్‌ను అమర్చారు. దీనివల్ల ఫోన్ లుక్ పూర్తిగా మారిపోయి సరికొత్త అనుభూతిని ఇస్తుంది. దీనికి తోడు ప్లాట్ మెటల్ ఫ్రేమ్, కుడివైపు ప్రత్యేకమైన ఆరెంజ్ కలర్ పవర్ బటన్‌తో ఈ డివైజ్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో ఆర్క్ వైట్, గ్రాఫైట్ బ్లాక్, టుండ్రా గ్రీన్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.

పనితీరు పరంగా చూస్తే, ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైఓఎస్ 16 సాఫ్ట్‌వేర్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఇందులో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ ప్రాసెసర్‌ను జోడించారు. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే, 6.78 ఇంచుల హైపర్‌లక్స్ అమోలెడ్ స్క్రీన్‌ను పొందుపరిచారు. ఇది 144Hz రీఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల హై-ఎండ్ గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు అత్యుత్తమ విజువల్స్ లభిస్తాయి.

ట్రిపుల్ కెమెరా

మొబైల్ ఫొటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకునేలా అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను పొందుపరిచారు. తద్వారా పగలు, రాత్రి తేడా లేకుండా స్పష్టమైన ఫొటోలు క్యాప్చర్ చేయవచ్చు.

బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే, ఇందులో 6,500mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా నాన్-స్టాప్ యూసేజ్ సొంతం చేసుకోవచ్చు. యూజర్ల ప్రైవసీ, భద్రత కోసం వేగంగా పనిచేసే ఇన్‌‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా ఇందులో ఇచ్చారు. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఈ డివైజ్ చక్కటి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత దీనికి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *