అమరావతి, ఆగస్ట్ 16: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ఎంపీసీ స్ట్రీమ్ తుది విడత (Final Phase) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఇంజినీరింగ్ తదితర ఎంపీసీ స్ట్రీమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు తదితర ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
AP EAPCET 2026 ఎంపీసీ స్ట్రీమ్ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ ఇదే..
- ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఫీజు చెల్లింపు తేదీలు: ఆగస్టు 17 నుంచి 20 వరకు
- వెబ్ ఆప్షన్ల నమోదు తేదీలు: ఆగస్టు 17 నుంచి 22 వరకు
- వెబ్ ఆప్షన్ల మార్పు: ఆగస్టు 23
- సీట్ల కేటాయింపు: ఆగస్టు 26
- సెల్ఫ్ జాయినింగ్, కళాశాలలో రిపోర్టింగ్: ఆగస్టు 27 నుంచి 31 వరకు
కౌన్సెలింగ్లో పాల్గొనే అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులకు సంబంధించిన వెబ్ ఆప్షన్లను నిర్ణీత గడువులో నమోదు చేయాలి. ఆప్షన్లను మార్చుకునేందుకు ఆగస్టు 23న అవకాశం కల్పించారు.
AP EAPCET 2026 బైపీసీ స్ట్రీమ్ తొలి విడత కౌన్సెలింగ్
మరోవైపు AP EAPCET 2026 బైపీసీ స్ట్రీమ్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ కౌన్సెలింగ్లో భాగంగా అభ్యర్థులు ఆగస్టు 20 వరకు రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన, ఫీజు చెల్లింపు ప్రక్రియలను పూర్తి చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ ధ్రువపత్రాల పరిశీలన, ఫీజు చెల్లింపు: ఆగస్టు 12 నుంచి 20 వరకు
- అప్లోడ్ చేసిన ధ్రువపత్రాల పరిశీలన (HLCల ద్వారా ఆన్లైన్లో): ఆగస్టు 13 నుంచి 20 వరకు
- వెబ్ ఆప్షన్ల నమోదు: ఆగస్టు 17 నుంచి 23 వరకు
- వెబ్ ఆప్షన్ల మార్పు: ఆగస్టు 24
- సీట్ల కేటాయింపు: ఆగస్టు 27
- సెల్ఫ్ జాయినింగ్, కళాశాలలో రిపోర్టింగ్: ఆగస్టు 28 నుంచి 31 వరకు
- కళాశాలలో తరగతులకు హాజరు: ఆగస్టు 28 నుంచి
అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో ప్రతి దశకు సంబంధించిన గడువులను తప్పకుండా పాటించాలి. ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు లేదా సీట్ల కేటాయింపు వంటి కీలక దశల్లో గడువు మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.