Headlines

Online Game: ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. మామను కొట్టి చంపిన అల్లుడు! | Andhra Pradesh: Online Game Addiction Turns Deadly: Son in Law Kills Father in Law Over Scolding


Online Game: పూతలపట్టు మండలం తేనేపల్లిలో ఆన్ లైన్ గేమ్ ఒక వ్యక్తి హత్యకు కారణమైంది. ఆన్ లైన్ గేమ్ ఆడుతున్న అల్లుడిని మందలించిన పాపానికి మామ హత్య కు గురయ్యాడు. టి.రంగంపేట ఎస్టీ కాలనీ లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. తేనేపల్లి రంగంపేట కు చెందిన సుబ్రహ్మణ్యం కు ఇద్దరు కూతుళ్లు. 60 ఏళ్ల సుబ్రహ్మణ్యం ఉప్పు అమ్మడం, లేదంటే కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. మదనపల్లి చెందిన అశోక్ కు పెద్ద కూతురును ఇచ్చి పెళ్లి చేయగా, అశోక్ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. సెలవు పై భార్య పిల్లలతో మామగారి ఇంటికి వచ్చిన అశోక్ ఆన్‌లైన్‌ గేమ్ ఆడుతూ ఉన్నాడు.

తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అల్లుడు ఆన్ లైన్ గేమ్ ఆడుతుండగా గుర్తించాడు. ఈ మేరకు ఈరోజు ఉదయం అల్లుడు అశోక్ ను మామ సుబ్రహ్మణ్యం మందలించాడు. ఆన్‌లైన్‌ జూదానికి బానిస కావద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైనా అల్లుడు అశోక్ మామ మందలింపును జీర్ణించుకోలేక పోయాడు. మామ సుబ్రహ్మణ్యంతో గొడవపడ్డాడు. ఆగ్రహనికి గురైన అల్లుడు అశోక్ మామపై పిడుగులతో దాడికి దిగాడు. దీంతో మామ సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందండంతో భయంతో అశోక్ పరారీ అయ్యాడు. కుటుంబ సభ్యులు చేరుకునే లోపు కనిపించకుండా పోయిన అశోక్ ను పోలీసులు వెతుకుతున్నారు. ఈ మేరకు
కేసు నమోదు చేసిన పూతలపట్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *