Headlines

Video: ఆసీస్ గడ్డపై బంగ్లాదేశ్ సరికొత్త హిస్టరీ.. 31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్! | Bangladesh historic test win against australia darwin records


Australia vs Bangladesh Darwin Test: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఎవరూ ఊహించని మహా సంచలనం నమోదైంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను పసికూన బంగ్లాదేశ్ ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి కొత్త అధ్యాయానికి తెరతీసింది. కంగారూల అహంకారాన్ని దెబ్బతీస్తూ 31 ఏళ్ల రికార్డులను తిరగరాసిన బంగ్లా పులులు, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఖాతాలో అత్యంత అవమానకరమైన రికార్డులను మూటగట్టాయి.

డార్విన్ వేదికగా అద్భుతం.. తొమ్మిది వికెట్లతో ఘనవిజయం..

డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టు పోరులో బంగ్లాదేశ్ జట్టు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా పేసర్ హసన్ మహ్మద్ ధాటికి కకావికలమైంది. హసన్ ఏకంగా 55 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి ఆసీస్ వెన్నువిరిచాడు. స్టీవ్ స్మిత్ మినహా మిగిలిన స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు.

ఎక్కువమంది చదివినది: IND vs ENG: ప్రపంచ రికార్డ్‌తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోతకు బలైన ఇంగ్లాండ్..!

ఇవి కూడా చదవండి



అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తరఫున తాంజిద్ హసన్ ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించిన తొలి బంగ్లా బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ 66 పరుగులిచ్చి 5 వికెట్లతో ఆసీస్ పని పట్టాడు. చివరకు నిర్దేశించిన కేవలం 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ కేవలం ఒకే వికెట్ కోల్పోయి సునాయాసంగా ఛేదించి 1-0తో సిరీస్‌లో ముందంజ వేసింది.

31 ఏళ్ల తర్వాత ఘోర పరాభవం.. బద్దలైన భారత రికార్డులు..

ఈ అద్భుత విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై ఎన్నో అరుదైన రికార్డులు నమోదయ్యాయి. 1995లో పాకిస్థాన్ చేతిలో ఓడిన తర్వాత, గత 31 ఏళ్ల కాలంలో ఆస్ట్రేలియా తమ స్వదేశంలో భారత్ చేతిలో తప్ప మరే ఇతర ఆసియా జట్టు చేతిలోనూ టెస్ట్ మ్యాచ్ ఓడిపోలేదు. ఆ సుదీర్ఘ చరిత్రకు బంగ్లాదేశ్ నేడు తెరదించింది. అంతేకాకుండా ఆసీస్ నేలపై అత్యంత వేగంగా తొలి విజయం నమోదు చేసిన ఆసియా జట్టుగా బంగ్లా సరికొత్త రికార్డు సృష్టించింది.

గతంలో పాకిస్థాన్ తమ ఏడో ప్రయత్నంలో, భారత్ తమ 12వ పర్యటనలో తొలి విజయాన్ని అందుకోగా.. బంగ్లాదేశ్ కేవలం మూడు టెస్టుల్లోనే ఈ అపూర్వ ఘనతను సాధించి భారత రికార్డును అధిగమించింది. వికెట్ల పరంగా చూస్తే, ఆసీస్ గడ్డపై ఆసియా జట్టు సాధించిన అతిపెద్ద విజయం ఇదే. 2020లో మెల్‌బోర్న్‌లో భారత్ 8 వికెట్లతో గెలవగా, బంగ్లాదేశ్ ఏకంగా 9 వికెట్లతో విజయం సాధించి సరికొత్త మైలురాయిని నెలకొల్పింది.

కమిన్స్ పేరిట అత్యంత చెత్త రికార్డు.. పాయింట్ల పట్టికలో దూకుడు..

ఈ ఘోర పరాజయంతో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఓ అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సొంతగడ్డపై రెండు వేర్వేరు ఆసియా జట్ల చేతిలో (2024లో భారత్ చేతిలో, 2026లో బంగ్లాదేశ్ చేతిలో) టెస్టు మ్యాచ్ ఓడిపోయిన తొలి ఆస్ట్రేలియా కెప్టెన్‌గా కమిన్స్ నిలిచాడు. ఈ ఓటమి ఆసీస్ ఆధిపత్యానికి గట్టి చెంపపెట్టుగా మారింది.

ఎక్కువమంది చదివినది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..!

ఈ సంచలన విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ మరింత బలపడింది. మ్యాచ్‌కు ముందు 58 శాతంగా ఉన్న వారి పాయింట్ల శాతం, ఈ భారీ గెలుపుతో ఏకంగా 66.67 శాతానికి పెరిగింది. నాలుగో స్థానంలో కొనసాగుతున్నప్పటికీ, తమ తొలి టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌కు బంగ్లాదేశ్ మరింత చేరువైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *