Headlines

జూనియర్ ఎన్టీఆర్ గాయంతో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అంతా మారిపోయిందా? | Jr NTR’s Injury Changes Prashanth Neel’s Plans: Will Salaar 2 With Prabhas Go On Floors video – Entertainment Videos in Telugu


జూనియర్ ఎన్టీఆర్ గాయంతో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అంతా మారిపోయిందా..? ఈ గ్యాప్‌లో ప్రభాస్‌తో సలార్ 2 మొదలుపెట్టాలని చూస్తున్నారా..? ఒకవేళ అలా అనుకుంటే.. డార్లింగ్ లైనప్ దానికి సహకరిస్తుందా..? ప్రభాస్ ఉన్న బిజీకి సలార్ 2 సాధ్యమయ్యే పనేనా..? ఇంతకీ ప్రశాంత్ నీల్ ముందున్న ఆప్షన్స్ ఏంటి..? ఈ రెండు భారీ ప్రాజెక్టుల్ని ఒకేసారి హ్యాండిల్ చేస్తారా.. ఎన్టీఆర్ భుజానికి సర్జరీ జరగడంతో ఆయన దాదాపు 2 నుంచి 3 నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. దీనివల్ల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే తారక్ లేని సన్నివేశాలను మాత్రం దర్శకుడు ఈ గ్యాప్‌లో చిత్రీకరిస్తూ వీలైనంత వరకు సినిమా పనులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తారక్ కోలుకునేలోపు దొరికిన ఈ ఖాళీ సమయంలో ప్రభాస్‌తో సలార్ 2 సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి 20 శాతం షూటింగ్‌తో పాటు చైల్డ్ హుడ్ ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ డేట్స్ ఇస్తే వెంటనే.. ఈ మేజర్ యాక్షన్ సీక్వెన్సులు షూట్ చేయడానికి నీల్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాతో బిజీగా ఉన్నారు.. దాంతో పాటు సెప్టెంబర్‌లో సందీప్ వంగా స్పిరిట్ కోసం 15 రోజులు, కల్కి 2 కోసం మరో 15 రోజులు ఆయన డేట్స్ కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైట్ షెడ్యూల్స్ మధ్య సడెన్‌గా ప్రశాంత్ నీల్ అడిగిన వెంటనే సలార్ 2 కోసం డార్లింగ్ డేట్స్ సర్దుబాటు చేయడం దాదాపు అసాధ్యమే. ఒకవేళ ప్రభాస్ తన కమిట్‌మెంట్స్‌తో సలార్ 2కి డేట్స్ ఇవ్వలేని పరిస్థితి వస్తే.. ప్రశాంత్ నీల్ ప్లాన్ మళ్లీ మారే అవకాశం లేకపోలేదు. అప్పటికల్లా ఎన్టీఆర్ కోలుకుని పూర్తిగా ఫిట్ అయితే.. తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుంది. అదే గనుక జరిగితే నీల్ తన పాత ప్లాన్ ప్రకారం మళ్లీ తారక్‌తోనే డ్రాగన్ సినిమా షూటింగ్‌లో బిజీ అవ్వొచ్చు. మొత్తానికి ఏం జరుగుతుందో చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తుపాకులు వదిలి ర్యాంప్‌పైకి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు..

ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు

ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వారి వల్ల కాలేదు.. చివరికి ఇలా..!

ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు!

మీ ఇంట సిరులు కురిపించే మొక్క! ఈ రోజులు, దిశలో నాటాలి గుర్తుంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *