దిన ఫలాలు (ఆగస్టు 18, 2026): మేష రాశి వారికి శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నత్తనడక నడుస్తాయి. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. సరికొత్త గుర్తింపు లభిస్తుంది. మిథున రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నత్తనడక నడుస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు సహాయం చేసిన వారు ముఖం చాటేసే అవకాశం ఉంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశముంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. సరికొత్త గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ఆదాయానికి లోటుండదు. ఒకటి రెండు కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమవుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.
ఇవి కూడా చదవండి
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. కొందరు బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు పడతారు. కుటుంబ జీవితం చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. శుభవార్తలు వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయి లాభాలు కనిపించకపోవచ్చు. ఇంటా బయటా బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉండవచ్చు కానీ, కొన్ని తప్పనిసరి ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సౌఖ్యం కూడా వృద్ధి చెందుతుంది. బంధు మిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు యథావిధిగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పిల్లలతో సమస్యలు తలెత్తవచ్చు. బంధుమిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
శ్రమకు తగ్గ ఫలితం ఉండకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థికవ్యవ హారాలు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. నిరుద్యోగు లకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది కానీ, పనిభారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొందరి వల్ల మోసపోయే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొందరు మిత్రులు ఇతోధి కంగా సాయపడతారు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభించే అవకాశంఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలకు, శక్తిసామర్థ్యాకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభదాయకంగా సాగుతాయి. బంధువుల వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. కుటుంబ వ్యవహారాల్లో ఇతరులను కల్పించుకోనివ్వవద్దు. ఆదాయం బాగా పెరుగుతుంది. అయితే, అనవసర ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది. ఆహార, విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది. బంధు మిత్రులతో హ్యాపీగా గడుపుతారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ, ప్రోత్సాహం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఇతరులకు వీలైనంతగా సహాయ సహకారాలు అందజేస్తారు. సొంత పనుల మీద కూడా శ్రద్ధ పెట్టడం మంచిది. మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాల్ని తేలి కగా పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. విందులు, వినోదాల మీద ఖర్చులు పెరుగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగుతుంది. అధికారులు బాగా ప్రాధాన్యమిస్తారు. ఉద్యోగపరంగా స్థిరత్వం లభించే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. లాభాలు సంతృప్తి కలిగించవు. వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభ వార్త అందుతుంది. .
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి సంబంధించి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం శ్రేయస్కరం. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఆస్తి వివాదంలో విజ యం సాధిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనులన్నీ సునాయాసంగా జరిగిపోతాయి. ఎక్కువగా కష్టపడకుండా ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొంత మంది స్నేహితులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం మీద కాస్తంత ఎక్కువ గానే శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయపడతారు.