Headlines

Aadhaar Card: ఆధార్‌ కార్డు రూల్స్.. జీవితకాలంలో డేట్ ఆఫ్ బర్త్, పేరు ఎన్నిసార్లు మార్చుకోవచ్చంటే..? కఠిన నిబంధనలు ఇవే.. | Aadhaar Update Rules: How Many Times Can You Change Your Name, Address, DOB and Mobile Number


ఈ రోజుల్లో ఆధార్ కార్డు అనేది ప్రతీఒక్కరికీ అవసరమే. ఇది లేనిది ఏ పని అంటూ జరగదు. ప్రభుత్వ పథకాల నుంచి ప్రైవేట్ సర్వీసుల వరకు ఏది పొందాలన్నా దీని అవసరముంటుంది. దీంతో ఆధార్ కార్డులో వివరాలన్నీ ఎలాంటి తప్పులు లేకుండా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఏమైనా వివరాలు తప్పుగా ఉంటే కేవైసీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆధార్‌లో వివరాలు తప్పుగా ఉన్నా.. కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. దీని వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మీరు మీ పేరు లేదా అడ్రస్ మార్చుకోవాలనుకుంటే యూఐడీఏఐ నిబంధనల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఆధార్‌లో పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, లింగం, మొబైల్ నెంబర్ అప్డేట్‌కు సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం.

పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవాలంటే..?

ఆధార్‌లో పేరు ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకోవడానికి వీలు ఉండదు. ఈ మేరకు యూఐడీఏఐ కొన్ని పరిమితులు విధించింది. జీవితకాలంలో ఆధార్‌లో కేవలం రెండుసార్లు మాత్రమే వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సరైన కారణాలు, అవసరమైన పత్రాలు చూపించి మూడోసారి మార్చుకునేందుకు వీలుంటుంది. కానీ ఈ ప్రక్రియ చాలా కఠినతరంగా ఉంటుంది. ఇక ఆధార్‌లో అడ్రస్ విషయానికొస్తే.. మీరు ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. ఇందుకు ఎలాంటి గరిష్ట పరిమితి అనేది ఉండదు. అయితే ఆధార్‌లో మార్చుకోవాలంటే చెల్లుబాటు అయ్యే పత్రాలు చూపించాల్సి ఉంటుంది. మీ వద్ద చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉంటే ఆధార్‌లో అడ్రస్‌ను ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు.

మొబైల్ నెంబర్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చంటే..?

ఇక ఆధార్‌లో మొబైల్ నెంబర్ ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి పరిమితులు లేవు. ఆధార్ వెబ్ సైట్, యాప్ ద్వారా సులువుగా మొబైల్ నెంబర్ ఎక్కడినుంచైనా అప్డేట్ చేసుకోవచ్చు. లేదా సమీపంలోని ఆధార్ సర్వీస్ కేంద్రానికి వెళ్లి అయినా ఛేంజ్ చేసుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్, లింగం జీవితంలో ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. దీంతో ఈ రెండింటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆధార్ పోర్టల్, యాప్ ద్వారా మార్చుకోవచ్చు. అయితే బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలంటే మాత్రం ఆధార్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్‌లో బయోమెట్రిక్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. దీని వల్ల కేవైసీ ఇబ్బందులు అనేవి ఉండవు. చాలామంది ఆధార్ తీసుకున్నప్పుడు బయోమెట్రిక్స్ నమోదు చేసి ఉంటారు. దీంతో ఇప్పుడు మరోసారి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *