Headlines

Earthquake: 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనాలు! | Massive 7.2 Magnitude Earthquake Strikes Southern Peru: No Tsunami Warnings Issued Yet


సౌత్ అమెరికాను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. దక్షిణ పెరూలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. పలు ప్రాంతాల్లో భవణాలు, గోడలు కుప్పకూలాయి. కొన్ని ప్రాంతాల్లో భవనాలకు పగుళ్లు వచ్చాయి. ముఖ్యంగా అండాహుయ్లాస్‌ సహా పలు ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. అంతేకాదు రాజధాని లిమాలోనూ స్వల్ప ప్రకంపనలు వచ్చాయని.. కానీ ఈ ప్రమాదం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం లేదని స్థానిక మీడియాలు పేర్కొన్నాయి.

అయితే అయకుచో ప్రాంతంలోని పరినాకొచాస్‌ ప్రావిన్స్‌లో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించిన పెరూ జియోఫిజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధికారులు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైనట్టు తెలిపారు. భూమికి 108 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఏర్పడినట్టు అధికారులు స్పష్టం చేశారు. కొరాకోరాలో మెర్కల్లి స్కేల్‌పై 3 నుంచి 4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని గుర్తించారు. అయితే ప్రస్తుతం సునామీ హెచ్చరిక జారీ కాలేదని పెరూ నేవీ వెల్లడింది. ఈ భూకంపం పరిస్థితిని పెరూ జియోఫిజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సౌత్ పెరూలో భూకంపాలు సంభవించడం ఇది కొత్తే కాదు గతంలోనూ చాలా సార్లు ఇక్కడ భూకంపాలు సంభవించాయి. ఇది తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో భాగం కవాడంతో ఇక్కడ ఎక్కవుగా భూకంపాలు సంభవించే ఛాన్స ఉంది. అంతేకాదు ఇకా ప్రాంతంలో 2007లో ఒక ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపం దాటికి సుమారు 600 మంది ప్రాణాలను కోల్పోయారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *