Headlines

మహీంద్రా 6 సీటర్​ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. లగ్జరీ ఫీచర్లతో వినియోగదారులకు పండగే


మహీంద్రా 6 సీటర్​ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. లగ్జరీ ఫీచర్లతో వినియోగదారులకు పండగే

ఎలక్ట్రిక్ వాహనాల ప్రియులకు మహీంద్రా అందించింది. ఎస్‌యూవీ మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న XEV 9S మోడల్‌లో ఇప్పుడు సరికొత్త సీటింగ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఎక్కువ స్పేస్, లగ్జరీ అనుభూతి కోరుకునే కుటుంబాల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు.

ప్రత్యేక కెప్టెన్ సీట్లు

మహీంద్రా ఎలక్ట్రిక్ SUV XEV 9Sలో కొత్త 6 సీట్ల ఆప్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వెర్షన్‌లో రెండో వరుసలో కెప్టెన్ సీట్లను అందిస్తున్నారు. 6-సీట్ల XEV 9S ధర రూ.25.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కొత్త సీటింగ్ ఆప్షన్‌ను ప్యాక్ టూ అబవ్, ప్యాక్ త్రీ, ప్యాక్ త్రీ అబవ్ ట్రిమ్‌లలో అందిస్తున్నారు. బేస్ ప్యాక్ వన్ అబవ్ మినహా మిగిలిన ట్రిమ్‌లలో 6 సీట్ల కాన్ఫిగరేషన్‌ను అందించనుంది.

7-సీట్ల వేరియంట్‌తో పోలిస్తే 6-సీట్ల XEV 9S ధర రూ.25,000 ఎక్కువగా ఉంది. 6-సీట్ల వెర్షన్‌లో రెండో వరుసలో బెంచ్ సీటుకు బదులుగా రెండు ప్రత్యేకమైన కెప్టెన్ సీట్లు ఉంటాయి. దీంతో వెనుక ప్రయాణికులకు మరింత స్థలం లభిస్తుంది. 6-సీట్ల వెర్షన్‌లో ప్రధానంగా రెండో వరుసలోని కెప్టెన్ సీట్లు మార్చారు. వీటికి ప్రత్యేక ఆర్మ్‌రెస్ట్‌లు ఉంటాయి.

అవసరమైనప్పుడు వీటిని పైకి మడవవచ్చు. దీంతో మూడో వరుసకు వెళ్లేందుకు మధ్యలో మరింత స్థలం ఏర్పడుతుంది. 7-సీట్ల మోడల్‌తో పోలిస్తే మూడో వరుసలోకి ఎక్కడం, బయటకు రావడం కూడా సులభంగా ఉంటుంది. 70kWh బ్యాటరీతో కూడిన ప్యాక్ టూ వేరియంట్ ధర రూ.25.25 లక్షలుగా ఉంది. అదే ప్యాక్ టూ 79kWh వెర్షన్ ధర రూ.26.15 లక్షలు. ప్యాక్ త్రీ 70kWh ధర రూ.28.05 లక్షలు కాగా, 79kWh బ్యాటరీతో కూడిన ప్యాక్ త్రీ ధర రూ.30.15 లక్షలుగా ఉంది.

బ్యాటరీ, రేంజ్

XEV 9S 6-సీట్ల వెర్షన్‌లో 70kWh, 79kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. అన్ని వేరియంట్లలో వెనుక భాగంలో ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్యాక్ టూ వేరియంట్‌లో మోటార్ పవర్ 245hpకి పరిమితం కాగా, మిగిలిన వేరియంట్లు 286hp శక్తిని ఉత్పత్తి చేస్తాయి. 70kWh బ్యాటరీతో XEV 9S గరిష్టంగా 600 కిలోమీటర్ల క్లెయిమ్‌డ్ రేంజ్‌ను అందిస్తుంది.

79kWh బ్యాటరీ వెర్షన్ గరిష్టంగా 679 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఓవరాల్‌గా చూస్తే, ఎక్కువ సౌకర్యం, ప్రత్యేక సీటింగ్ కోరుకునే కుటుంబాల కోసం XEV 9Sలో 6 సీట్ల ఆప్షన్‌ను మహీంద్రా తీసుకొచ్చింది. ముఖ్యంగా మూడో వరుస ప్రయాణికులకు ఎక్కువ స్పేస్ లభిడవం ఈ కొత్త కాన్ఫిగరేషన్‌లో అడిషనల్ బెనిఫిట్‌గా చెప్పుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *