Headlines

ప్యాకింగ్ ఫుడ్స్‌పై రాసేదంతా నిజమేనా.. FSSAI తనిఖీల్లో షాకింగ్ నిజాలు! | FSSAI Issues 150 Notices to Major Food Brands over Misleading Ads and Labelling Violations


దేశంలో రూల్స్ పాటించిన ఆహార తయారీ సంస్థలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఉక్కుపాదం మోపుతోంది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా నిబంధనలకు విరుద్ధంగా లేబుల్స్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రూల్స్ పాటించని దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లైన నెస్లే ఇండియా, పెప్సికో, కోకాకోలా ఇండియా, అబాట్ ఇండియా, డానోన్ ఇండియా, మోండెలీజ్ ఇండియా, ఫెర్రెరో ఇండియా, కెన్‌వ్యూ వంటి సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

అంతేకాదు ప్రముఖ ఎనర్జీ డ్రింక్స్ తయారీ సంస్థలైన రెడ్ బుల్ ఇండియా, మాన్‌స్టర్ ఎనర్జీ ఇండియా, హెల్ ఎనర్జీతో పాటు డియాజియో, పెర్నోడ్ రికార్డ్ వంటి ఆల్కహాల్ బ్రాండ్లు, ఆహార భద్రతా రూల్స్‌ను పెడచెవిన పెట్టిన పలు కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. అలాగే నిబంధనలు పాటించని ఓ అమెజాన్ వేర్‌హౌస్ లైసెన్స్‌ను సీజ్ చేశారు.

అలాగే ప్రముఖ ఆహార తయారీ సంస్థలైన కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్, పిజ్జా హట్, డొమినోస్, కోస్టా కాఫీ వంటి ప్రముఖ ఫుడ్ ఔట్‌లెట్లకు 30కి పైగా నోటీసులు జారీ చేశారు. డొమినోస్‌కు సంబంధించిన ఐదు దుకాణాల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేశారు. అయితే ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై చేసే ప్రకటనలు వాస్తవ రూపంలో ఉండాలనే FSSAI నోటీసులతో అప్రమత్తమైన కొన్ని సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తులపై ఉన్న లేబుల్స్‌ను ఛేంజ్ చేయడం స్టార్ట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *