Headlines

దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి.. | Chennai woman murder case body parts found in suitcase police uncover shocking evidence video tv9d


చెన్నైలో అత్యంత అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ఆమె శరీర భాగాలతో నిందితులు బిర్యానీ వండిన తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆగస్టు 5న చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆగ్రా రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఓ జనరల్ కంపార్ట్‌మెంట్‌లో తీవ్ర దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బోగీని తనిఖీ చేశారు. ఆ బోగీలో ఎరుపు రంగు సూట్‌కేసు ఒకటి పోలీసులకు దొరికింది. దాన్ని తెరిచి చూసిన పోలీసులు దెబ్బకు షాకయ్యారు. అందులో ముక్కలుగా కోసిన మహిళ శరీర భాగాలు బయటపడటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న తమిళనాడు, ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని 350కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి, మహిళ కలిసి ఎరుపు రంగు సూట్‌కేసును రైలులో ఉంచి వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం సబర్బన్ రైలు ద్వారా గూడువాంజేరి చేరుకున్నట్లు తేల్చారు. ఆటోను అనుసరించి గూడువాంజేరిలోని వారు నివసిస్తున్న ఇంటిని పోలీసులు గుర్తించారు. ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా పోలీసులకు భయానక దృశ్యాలు కనిపించాయి. ఇల్లంతా రక్తపు మరకలు ఉండటంతో పాటు, ఓ పెద్ద బిర్యానీ పాత్ర కనిపించింది. దాని మూత తొలగించి చూడగా బియ్యంతో పాటు మానవ శరీర భాగాలు ఉండటంతో పోలీసులు కంగుతిన్నారు. మృతురాలిని ఒడిశాకు చెందిన హయాత్‌ నిషాగా గుర్తించారు. ఆమెతో పాటు ఉంటున్న బంధువులు మాణిక్‌ ఉత్తిన్‌ లస్కర్‌, అతని భార్య భాగమతి మాజిక్‌ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి తల ఇంకా లభించకపోవడంతో, నిందితుల కోసం పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల

బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్‌ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్‌ చేసుకోవాలి?

వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !

కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!

అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *