Headlines

Tollywood : అమీర్ పేట్‏లోని సారథి స్టూడియో మాదే.. ఎందుకు అమ్మాల్సి వచ్చిందంటే.. టాలీవుడ్ సీనియర్ నటుడు.. | Actor GV Narayana Rao Says About Saradhi Studios Legacy and Why He Sale Studio


నటుడు జీవీ నారాయణ రావు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుగు సినిమా చరిత్రలో సారధి స్టూడియోకు ఉన్న ప్రాముఖ్యతను, తన కుటుంబంతో దానికి ఉన్న బంధాన్ని గురించి వివరించారు. ఆయన బాల్యం, తమ కుటుంబం నవయుగ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం, సారధి స్టూడియో ఎలా వారి ఆధీనంలోకి వచ్చింది, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు ఎందుకు వచ్చారు ?, “దేవదాస్” సినిమా వివాదం వంటి అనేక ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. నారాయణ రావు గుంతకల్‌లో పుట్టి, ఎనిమిదో తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. ఆయన తండ్రి నవయుగ ఫిలిమ్స్ అనే టాప్ మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. మూడు ఏరియాలకు ముగ్గురు పంపిణీదారులు ఉండేవారని, తన తండ్రి గుంతకల్‌లో ఉండేవారని తెలిపారు. 1964లో సారధి స్టూడియోను నవయుగ ఫిలిమ్స్ సొంతం చేసుకోవడంతో వారి కుటుంబ ప్రస్థానం హైదరాబాద్‌కు మారింది. వాస్తవానికి చల్లపల్లి రాజా రామకృష్ణ ప్రసాద్‌కి చెందిన ఈ స్టూడియోలో నవయుగ ఫిలిమ్స్ 45 శాతం వాటాలను కొనుగోలు చేసింది. దీనితో నారాయణ రావు తండ్రి గుంతకల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్టూడియో బాధ్యతలను స్వీకరించారు.

ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..

సారధి స్టూడియో స్థాపన, అభివృద్ధిలో అక్కినేని నాగేశ్వరరావు నిర్ణయం కీలకమని జీవీ నారాయణ రావు తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రోత్సాహం కూడా హైదరాబాద్‌లోని సినీ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడింది. నారాయణ రావు తండ్రి సారధి స్టూడియోను 1964 నుంచి సమర్థవంతంగా నిర్వహించారు. మొదట్లో ఒకే ఫ్లోర్‌తో ఉన్న స్టూడియోను తర్వాత మూడు ఫ్లోర్‌లకు విస్తరించారు. నేటి అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో ఒకప్పుడు సారధి స్టూడియో గేటు ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..

అయితే, సారధి స్టూడియో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని, కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన విభేదాల వల్ల 80వ దశకంలో దానిని విక్రయించాల్సి వచ్చిందని నారాయణ రావు వెల్లడించారు. అప్పుడు కోట్లకు అమ్ముడుపోయిన స్టూడియో ఆస్తి, నేడు వేల కోట్లలో ఉంటుందని ఆయన తెలిపారు. తమ కుటుంబానికి సారధి స్టూడియో ఒక్కటే కాకుండా, సరోవర్ హోటల్ వంటి ఇతర ఆస్తులు కూడా ఉండేవని పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి :  Eshwar Sai : ఆ టైంలోనే మాధురి నాకు కనెక్ట్ అయ్యింది.. ఆమె చాలా మంచిది.. నోరు విప్పిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి..

నటుడు జీవీ నారాయణ రావు..

Gv Narayana Rao Movies

Gv Narayana Rao Movies

ఎక్కువమంది చదివినవి :  Comedian Sudhakar: ఒక్క సినిమాకు రూ.30 వేల రెమ్యునరేషన్.. ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నటుడు సుధాకర్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *