Headlines

సర్వమత సమ్మేళనానికి నిదర్శనం.. న్యూయార్క్‌ వేదికగా కీలక ప్రసంగం చేయనున్న RSS చీఫ్‌ మోహన్ భగవత్ | RSS Chief Mohan Bhagwat to Address Universal Oneness event in New York says Sunil Ambekar


ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆగస్టు 29న అమెరికాలో జరిగే ఓ ర్యాలీలో పాల్గొననున్నారు. న్యూయార్క్ నగరంలోని మ్యాడిసన్ స్క్యేర్ గార్డెన్‌లో 5వేల మందితో భగవత్‌ మీటింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. RSS శతాబ్ది గ్లోబల్ అవుట్‌రీచ్‌లో భాగంగా యూనివర్సల్ వన్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, మోహన్ భగవత్ పర్యటనకు ముందు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ కీలక ప్రకటన చేశారు. న్యూయార్క్‌లో జరిగే విశ్వ ఏకత్వ వేడుక ఒక సర్వమత సమ్మేళనానికి నిదర్శనమని స్పష్టంచేశారు. అక్కడ జరిగే కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ డా. మోహన్ భగవత్ విభిన్న, బహుళ సాంస్కృతిక, బహుళ మతాలకు చెందిన ప్రేక్షకులతో సంభాషిస్తారన్నారు.

న్యూయార్క్‌లో జరిగే ‘యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్’ ఒక సర్వమత సమ్మేళనానికి నిదర్శనం. ఇక్కడ ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ డా. మోహన్ భగవత్ గారు విభిన్న, బహుళ సాంస్కృతిక, బహుళ మతాలకు చెందిన ప్రేక్షకులతో సంభాషిస్తారు. బహిరంగ సంభాషణ, పరస్పర గౌరవం అనే స్ఫూర్తితో నిర్వహించబడిన ఈ కార్యక్రమం, ప్రాథమికంగా అందరినీ కలుపుకొనిపోయే, స్వాగతించే భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.

ఈ కార్యక్రమం, భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న వర్గాలతో అవగాహన, ఉమ్మడి లక్ష్యాన్ని పెంపొందించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సుదీర్ఘ సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. RSS దార్శనికత, తత్వశాస్త్రం గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ బహిరంగ సంభాషణ వేదికలలో పాల్గొనవలసిందిగా మేము ఆహ్వానిస్తున్నాము.. అంటూ సునీల్ అంబేకర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *