Headlines

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం సినిమా.. మనీ హీస్ట్ లాంటి క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది | Malayalam Crime Thriller I, Nobody Movie Is Trending Top Now On Jio Hotstar OTT


ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో సందడి చేయనున్నాయి.మైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా, బంధర్ సినిమాలతో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వారంలోనే ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులో రానున్నాయి. అయితే వీటికంటే ముందే రెండు రోజుల క్రితం ఒక సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా. కొద్ది రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ ఓ మోస్తరుగా ఆడంది. ఇప్పుడీ సినిమా ఒకేసారి మలయాళం, తెలుగుతో పాటు ప్రధాన భాషల్లోనూ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇందులో హీరో రాజీవ్ ఓ బ్యాంక్ ఉద్యోగి. భార్య మీరా ఇద్దరు పిల్లలతో కలిసి హాయిగా జీవిస్తుంటాడు. అయితే సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలో ఒక ఊహించని సంఘటన ఎదురవుతుంది. ఓ బ్యాంకులో జరిగిన దోపిడీ వ్యవహారంలో అతని ప్రమేయం లేకుండానే చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఈ స్కాంకు పాల్పడిన వ్యక్తులు చనిపోయినా… డబ్బు విషయంలో క్లారిటీ రాదు. అందరూ రాజీవ్‌నే తప్పుగా అనుకుంటారు. దీనికి తోడు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం కావడంతో తన ఫ్యామిలీ కూడా తీవ్ర అవమానాలు ఎదుర్కొంటోంది.

మరి తనకు వచ్చిన సమస్యలను రాజీవ్ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ స్కామ్ ఆరోపణల నుంచి ఎలా బయటపడ్డాడు? అసలు ఈ స్కామ్ ఎవరు చేశారు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ సినిమా పేరు ‘ఐ నోబడీ’. నిజామ్ బషీర్ తెరకెక్కించిన ఈ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ లో పార్వతీ తిరువోతు కథానాయికగా చేసింది. వీరితో పాటు హకీమ్ షాజహాన్, అశోకన్, విజయ రాఘవన్, మధుపాల్, శంకర్ రామకృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ వంటి 5 భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. మంచి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకున్న వారు ‘ఐ నోబడీ’ పై ఓ లుక్కేసుకోవచ్చు.

పృథ్వీరాజ్ సుకుమారన్ ఐ నో బడీ సినిమా ట్రైలర్ తెలుగులో…



ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *