సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఒక మలుపు ఉంటుంది. కానీ సినిమా మొత్తం ట్విస్టులే ఉంటే.. అలాంటి చిత్రాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒకటి. కేవలం రెండే పాత్రలు.. వారి మధ్య జరిగే సంఘటనలు. వాటిలో ఉండే అనేక మలుపులు. అదే లెవల్ క్రాస్. 2024లో విడుదలైన మలయళీ థ్రిల్లర్ సినిమా. ఇందులో ఆసిఫ్ అలీ, అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా అందుబాటులో ఉంది. మనం చూసేదంతా నిజం కాదు. అందులోనూ సగం అబద్ధం అయితే అనేది ఈ మూవీ కథ అని చెప్పుకొవచ్చు. మనిషి అంతర్గత మనస్తత్వం గురించి ఈ సినిమా వివరిస్తుంది.
ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..
కథ విషయానికి వస్తే.. నిర్మానుష్యంగా ఉన్న ఒక రైల్వే క్రాసింగ్ అది. దాని పక్క ఇంట్లో గేట్ కీపర్ (ఆసిఫ్ అలీ) నివసిస్తుంటాడు. మురికి బట్టలతో మరకలు పడిన పళ్లతో అతను చూడటానికి చాలా వింతగా కనిపిస్తుంటాడు. అప్పుడప్పుడు వెళ్లే రైలుకు చేయి ఊపి తన ఇంటికి వెళ్లొస్తుంటాడు. అయితే ఒకసారి కదులుతున్న రైలు నుంచి అమలా పాల్ దూకుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తన ఇంటికి తీసుకెళ్తాడు ఆసిఫ్. మెలకువ వచ్చిన తర్వాత తన గురించి చెబుతుంది అమలా పాల్. కానీ అతడితో ఉండేందుకు భయపడుతుంది. మహిళ ఎవరు? ఆమె రైలు నుంచి ఎందుకు దూకింది? ఆ గేట్‌కీపర్ నేపథ్యం ఏమిటి? అనేక ఆసక్తికరమైన మలుపులతో చివరికి ఏం జరిగిందో చెప్పే చిత్రమే ‘లెవెల్ క్రాస్’.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది. డైరెక్టర్ అర్భాజ్ అయ్యూబ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభంలో నెమ్మదిగా సాగినప్పటికీ, ముందుకు సాగేకొద్దీ వేగం పుంజుకుంటుంది.ఈ మూవీ ఆద్యంతం కట్టిపడేస్తుంది.
ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..
ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..