Headlines

ఈ నటి ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేదని నమ్మేరు : మాధవపెద్ది మూర్తి | Madhavapeddi Murthy Recounts Telugu Cinemas Golden Era and Artists Struggles


ప్రఖ్యాత నృత్య కళాకారుడు మాధవపెద్ది మూర్తి తన జీవిత ప్రస్థానం, తెలుగు చిత్రసీమలోని పూర్వ వైభవం, కళాకారుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాలను ఇటీవల ఓ కార్యక్రమంలో పంచుకున్నారు. మధురైకి బదిలీ అయిన సమయంలో, తన తండ్రి మాధవపెద్ది సత్యం గారి దూరదృష్టితో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలి నృత్యాన్నే తన వృత్తిగా ఎంచుకున్నానని మూర్తి తెలిపారు. అప్పట్లో హేమమాలిని,నూపుర్, మీనాక్షి శేషాద్రి వంటి నటీమణులకు తాను నృత్యం నేర్పించానని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి ప్రోత్సాహం, గురువు వెంపటి చినసత్యం గారి దీవెనలతో కలైమామణి వంటి బిరుదులు లేకున్నా, నృత్యంపై నమ్మకంతో ముందుకు సాగానని వివరించారు.

అయితే, సినీ ప్రపంచంలోని కొన్ని చేదు నిజాలను కూడా మూర్తి వెల్లడించారు. నటి గిరిజ ఉంటే సినిమా హిట్ అయ్యేదని, రేలంగి గారు వంటి వారు నటించినా, వారి సంపాదన దాచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహానటులు హరినాథ్, కాంతారావు వంటి వారు ఆర్థిక ఇబ్బందులతో తన తండ్రిని సహాయం కోసం అడిగిన సందర్భాలను కళ్ళారా చూశానని చెప్పారు. పింగళి నాగేంద్రరావు ఇంటి ఓనర్‌గా, ఘంటసాల వంటి మహానుభావులు నివసించిన ప్రదేశంలో తమ ఇల్లు ఉండేదని, హీరోయిన్ సుచిత్ర తమ ఇంటిలో కింద అద్దెకు ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.

తన తండ్రి మాధవపెద్ది సత్యం గొప్పదనాన్ని తెలియజేసే ఒక సంఘటనను మూర్తి వివరించారు. వాణిశ్రీ మహానటి కాకముందు చింతామణి నాటకంలో చెలికత్తె పాత్రలో నటిస్తున్న రత్నకుమారి (వాణిశ్రీ అసలు పేరు)ని చూసి “నువ్వు పెద్ద స్టార్ అవుతావు” అని తన తండ్రి చెప్పేవారట. ఆ మాట నిజం కావడంతో వాణిశ్రీ, సత్యం గారి పేరు మీద తానిచ్చే అవార్డును ఎంతో గౌరవంగా స్వీకరించారు. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, సావిత్రి అవార్డు తప్ప తానెప్పుడూ అవార్డులు తీసుకోనని వాణిశ్రీ అన్నా, తన తండ్రిపై ఉన్న గౌరవంతో మాధవపెద్ది మూర్తి స్థాపించిన అవార్డును తీసుకున్నారని ఆయన తెలియజేశారు. ఈ సంఘటన కళాకారుల మధ్య ఉన్న లోతైన అనుబంధాలను, విలువలను స్పష్టం చేస్తుంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *