Headlines

Irumudi Komaram: ‘ఇరుముడి’ సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలు తీసుకున్నాడా? | Irumudi Movie: Jabdardasth Actor Komaram Reveals His Remuneration For RaviTeja Movie


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరుముడి ప్రభంనం కొనసాగుతోంది. థియేటర్లలోరిలీజై వారం రోజులు గడిచిపోయినా సరే ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దుమ్మురేపుతోది. వీక్ డేస్ లోనూ రవితేజ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తుండడం విశేషం. మరోవైపు భారీ అంచనాలతో రిలీజైన ‘టాక్సిక్’ సినిమాకు నెగెటివ్ టాక్ రావడం ఇరుముడికి మరింత ప్లస్ అయ్యింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సుమారు రూ.135 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం వెల్లడించింది. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ డివోషనల్ థ్రిల్లర్ సినిమాలో రవితేజ సరసన ప్రియాభవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. అలాగే సీనియర్ నటుడు సాయి కుమార్ మరో కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక రవితేజ కూతురు పాత్ర లో మణెమ్మగా బేబీ నక్షత్ర నటన సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. వీరితో పాటు శ్వాసిక, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, లక్ష్మణ్ మీసాల, రామ్ కుమార్ కసిరెడ్డి తదితరలు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా జబర్దస్త్ లో లేడీ వేషాలు వేసుకునే కొమరం అలియాస్ కొమరక్క ఇరుముడి సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. విలన్ షేడ్స్ ఉన్న నాగులు అనే నెగెటివ్ రోల్ లో ఆకట్టుకున్నాడు. సినిమాలో కొమరం పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. దీంతో సంతోషంతో తెగ ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడీ జబర్దస్త్ కమెడియన్. ఈ నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తను పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నాడు. ఇదే క్రమంలో ఇరుముడి సినిమా గురించి, అందులో తన రెమ్యునరేషన్ వివరాల గురించి కూడా కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు.

‘ఇరుముడి సినిమా కోసం నేను 16 రోజులు పని చేశాను. రోజుకు రూ. 60 వేలు చొప్పున రెమ్యునరేషన్ ఇచ్చారు’ అని కొమరం చెప్పుకొచ్చాడు. అంటే ఈ లెక్కన ఇరుముడిలో నటించినందుకు గానూ మొత్తం 9.6 లక్షల పారితోషికం అందుకున్నాడు కొమరం. కాగా ఈ సినిమా విజయంతో ఏకంగా పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు కొమరం. బలగం వేణు తెరకెక్కిస్తోన్న ‘ఎల్లమ్మ’లో ఈ జబర్దస్త్ నటుడికి అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఇరుముడి సినిమాతో కొమరక్క క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం రోజుకు రూ.60 వేల పారితోషికం తీసుకునే ఈ జబర్దస్త్ కమెడియన్ త్వరలోనే క్రేజ్ పెరిగి రూ.లక్ష తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇవి కూడా చదవండి



ఇరుముడి సినిమాలో కొమరం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *