Headlines

Prabhas Sreenu: ఆ హీరో ఎవ్వరికీ రికమెండ్ చేయడు.. చాలా మొహమాటస్తుడు : ప్రభాస్ శ్రీను | Prabhas sreenu sensational comments about hero prabhas


తెలుగు ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు ప్రభాస్ శ్రీను. తన విలనిజంతో అలాట్ కామెడీ టైమింగ్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించారు. ఇప్పటివరకు ఆయన 150కి పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అనుభవాలను, స్టార్ హీరోలతో తనకున్న రిలేషన్ గురించి కూడా ఆయున మాట్లాడారు. ముఖ్యంగా ప్రభాస్ గురించి ఆయన అనేక విషయాలు వెల్లడించారు.

అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు సెట్ బాయ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్

ప్రభాస్ శ్రీను ప్రభాస్ సినిమాల్లో నటించడం గురించి మాట్లాడుతూ, ప్రభాస్ ఎవరికీ రికమెండ్ చేయరని, అది దర్శకుల నిర్ణయమని చెప్పారు. ప్రభాస్ చాలా మొహమాటస్తుడని, ఎవరికీ చెప్పడని వెల్లడించారు. తన పాత్ర నచ్చితే దర్శకులు తనకు అవకాశాలు ఇస్తారని శ్రీను తెలిపారు. అలాగే తన పని, కుటుంబ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతూ, తన భార్య ఎంతో అర్థం చేసుకునే వ్యక్తి అని, ఆమె సహకారం వల్లనే తాను అన్ని పనులు చేసుకోగలుగుతున్నానని చెప్పారు. అర్థరాత్రి ఒకటి, రెండు, మూడు గంటలకు ఇంటికి వచ్చినా ఆమెకు అభ్యంతరం ఉండదని, తనను ఎప్పుడూ ప్రశ్నించదని శ్రీను పంచుకున్నారు.

నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడారు.. సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్

అయితే, కొన్నిసార్లు షూటింగ్ అని చెప్పి సరదాగా బయటకి వెళ్ళినప్పుడు ఆమెకు తెలిసిపోయి, అప్పుడు “డోస్ పడతాది” అని నవ్వుతూ చెప్పారు. తన భార్య తన ఫోన్‌లోని మెసేజ్‌లను చూసి, “నీకు అవసరమా ఈ వయసులో నువ్వు ఒక పెద్ద అందగాడివి, నీకేమో ఈళ్ళతో చాటింగ్లు గోల” అని సరదాగా తిడుతుందని, కానీ నవ్వుతుందని తెలిపారు. హీరోయిన్లతో కాకుండా, స్విగ్గీ ఆర్డర్లు లేదా అలాంటి వాటికి సంబంధించిన మెసేజ్‌లు అని ఆమెకు తెలుసని, అయినా సరదాకి తనను టీజ్ చేస్తుందని ప్రభాస్ శ్రీను తమ దంపతుల మధ్య ఉన్న బంధాన్ని వివరించారు.

ఇవి కూడా చదవండి



నిన్ను ఎవరు గుర్తుపడతారు.. కనీసం గూగుల్ కూడా నీ పేరు రాదని అవమానించారు: వైష్ణవి చైతన్య

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *