Headlines

Cinema OTT: ఆరేళ్ల తర్వాత శాపగ్రస్త కేసు రీఓపెన్.. ఊహించని మలుపులు.. బీభత్సమైన ఉత్కంఠ.. ఓటీటీలోకి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ.. | This Malayalam Thriller movie Unmadham Movie Streaming Date Announced


మలయాళ ఇండస్ట్రీలో వరుస సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలు ఓటీటీ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ కోవలోనే ప్రముఖ నటుడు కుంచాకో బోబన్ , ‘జై భీమ్’ ఫేమ్ లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ‘ఉన్మాదం’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 4వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV) లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను విడుదల చేయగా, దానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి కిరణ్ దాస్ దర్శకత్వం వహించారు.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

కథ విషయానికి వస్తే.. కొంగడ్ పోలీస్ స్టేషన్‌లో ఆర్నెళ్ల క్రితం మూతపడిన ఒక అన్-సాల్వ్డ్ కేస్ ఫైల్ చుట్టూ కథ తిరుగుతుంది. ఆ ఫైల్‌ను ముట్టుకోవడానికే సీనియర్ పోలీసులు సైతం భయపడుతుంటారు. ఈ కేసును ఛేదించడానికి ధైర్యంగా అడుగు ముందుకు వేసే పోలీస్ ఆఫీసర్‌గా కుంచాకో బోబన్ నటించారు. దర్యాప్తు చేసే కొద్దీ భయానక మూఢనమ్మకాలు, ఊహించని సూపర్ నేచురల్ ఘటనలు ఆయన ఎదురవుతాయి. ఒకవైపు క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మరోవైపు సైకలాజికల్ హర్రర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను సీటు అంచులపై కూర్చోబెట్టేలా ట్రైలర్ రూపుదిద్దుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

జాతీయ అవార్డు గ్రహీత షాహి కబీర్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. మిస్టరీ, హర్రర్, థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు ‘ఉన్మాదం’ ఒక మంచి ఆప్షన్‌గా నిలవనుంది. ఈ సినిమా జులై 31, 2026న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కన్వెన్షనల్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాలా కాకుండా సైకలాజికల్ హర్రర్ మిస్టరీగా తెరకెక్కిన ఈ చిత్రం థ్రిల్లర్ ప్రేమికులకు మంచి వీక్షణ అనుభూతిని ఇస్తుంది.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *