Headlines

పాలసీదారు కుటుంబానికి ఊరట.. ఇన్స్యూరెన్స్ సంస్థకు షాక్! కోటి బీమా మొత్తంతో పాటు 9% వడ్డీ చెల్లించాలని ఆదేశం! | Consumer Commission Orders HDFC ERGO to Pay ₹1 Crore Insurance Claim with 9% Interest


సేవా లోపంతో పాలసీదారు కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసినందుకుగాను HDFC ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థకు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జరిమానా విధించింది. నంద్యాల జిల్లా బనగానపల్లికి చెందిన గుండ్ల మూలయ్య హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో కోటి రూపాయలకు పాలసీ తీసుకున్నారు. 2025 జూలై 28న ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నామిని అయిన ఆయన భార్య ప్రమీల భీమా పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోగా పాలసీ తీసుకునే సమయంలో ఆదాయ వివరాలు తప్పుగా చూపించారు అంటూ సంస్థ తిరస్కరించింది. దీంతో బాధితులు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ని ఆశ్రయించారు.

కేసు పూర్వాపరాలు పరిశీలించిన కమిషన్.. బీమా సంస్థ ఆదాయ ధ్రువీకరణ పత్రంలో తప్పులను నిరూపించడంలో విఫలమైందని గుర్తించింది. సేవా లోపంగా పరిగణించిన కమిషన్ అధ్యక్షులు కరణం కిషోర్ కుమార్, సభ్యులు ఎన్ నారాయణ, ఎస్ నజీ మా కౌసర్.. ఫిర్యాదుదారుకి కోటి మొత్తాన్ని 2025 నవంబర్ 4వ తేదీ నుంచి 9% వడ్డీతో చెల్లించాలని, మానసిక వేదనకు గురిచేసినందుకుగాను 25,000, కోర్టు ఖర్చుల కింద మరో 10 వేలు 45 రోజుల్లోగా చెల్లించాలని తీర్పు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *