Headlines

చిరంజీవితో ఆ స్టార్ హీరోయిన్.. మధ్యలోనే ఆగిపోయిన సినిమా..! 30 మంది బ్రతిమిలాడినా ఆమెతో చేయనున్న డైరెక్టర్ | Do you know which movie starred Chiranjeevi and was produced by Sridevi, It is Vajrala Veta


మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు, మలుపులు ఉన్నాయి. ఆయన మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి, వసూళ్ల సునామీ సృష్టించగలరని నిరూపించిన గొప్ప నటుడు. చిరంజీవితో ఎంతో మంది కథానాయికలు, దర్శకులు కలిసి పనిచేశారు. వారిలో శ్రీదేవి ఒకరు. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ అంటే ముందుగా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా గుర్తుకొస్తుంది. ఈ బ్లాక్‌బస్టర్ కాకుండా, వారిద్దరూ మరికొన్ని చిత్రాలలో కలిసి నటించారు. అయితే, వీరిద్దరి కలయికలో ప్రారంభమై, చరిత్రలో నిలిచిపోయిన ఒక చిత్రం గురించి చాలామందికి తెలియదు. ఆ చిత్రం పేరు వజ్రాల వేట. దీనికి సంబంధించిన ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఈ సినిమాకు నిర్మాత మరెవరో కాదు, దివంగత నటి శ్రీదేవి స్వయంగా వ్యవహరించారు.

ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు.. నేను షాక్ అయ్యా

ఈ విశేషాలను అప్పట్లో చిరంజీవితో అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎందుకంటే, ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఆయనే. శ్రీదేవి ఎంతో ఇష్టపడి, తనకూ చిరంజీవికీ ఈ చిత్రం బాగుంటుందని నమ్మి, సొంతంగా నిర్మించేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి అనేక సూపర్ హిట్స్ అందించిన కోదండరామిరెడ్డిని దర్శకుడిగా నియమించుకున్నారు. వజ్రాల వేట పేరుతో ఈ అడ్వెంచర్ యాక్షన్ చిత్రాన్ని ప్రారంభించారు. షూటింగ్ కూడా మొదలైంది. రెండు పాటలు, కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది.

అతను చాలా మంచి మనిషి..! అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..

అయితే, ఈ దశలో దర్శకుడు కోదండరామిరెడ్డికి ఏదో తేడా కొడుతున్నట్టు అనిపించిందట. చిత్రీకరణ జరుగుతున్న తీరు, కథాంశంపై ఆయనకు అనుమానాలు మొదలయ్యాయి. అప్పుడు ఆయన శ్రీదేవిని పిలిపించి, “అమ్మా, ఈ కథ మీకు, చిరంజీవికి సరిపోయే కథ కాదు. మీ ఇద్దరి కాంబినేషన్‌లో నేను అనుకున్నట్టుగా సినిమా రావడం లేదు” అని స్పష్టంగా చెప్పారట. దర్శకుడి విశ్లేషణను గౌరవించిన శ్రీదేవి, “కొన్ని రోజులు విరామం తీసుకుందాం సార్” అని బదులిచ్చారు. అలా ఆగిపోయిన ఆ సినిమా తిరిగి ఎప్పుడూ ప్రారంభం కాలేదు. వజ్రాల వేట అనే అడ్వెంచర్ యాక్షన్ చిత్రం షూటింగ్‌ దశలోనే ఆగిపోయిన చిత్రంగా మిగిలిపోయింది. కోదండరామిరెడ్డి ఇదే ఇంటర్వ్యూలో శ్రీదేవి గొప్పతనం గురించి మాట్లాడుతూ, ఆ తర్వాత కాలంలో శ్రీదేవి ఎంతో బతిమాలిందని, తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలను హిందీలో రీమేక్ చేయమని తనను కోరిందని చెప్పారు. కనీసం 30 మంది నిర్మాతలను అడ్వాన్స్ ఇచ్చి తన వద్దకు పంపిందని, కానీ శ్రీదేవితో సినిమా చేయడం వీలవ్వలేదని కోదండరామిరెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన, శ్రీదేవికి దర్శకుడిపై ఉన్న గౌరవం, ఆమె వృత్తి పట్ల నిబద్ధతను తెలియజేస్తుంది. చిరంజీవి, శ్రీదేవిల అభిమానులకు వజ్రాల వేట ఒక తీరని కలగానే మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి



16 ఏళ్లకే ఎంట్రీ 26ఏళ్లకే కెరీర్ క్లోజ్..! పెళ్ళైన 15 రోజులకే పారిపోయిన భర్త..!! ఈ హీరోయిన్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్ట్‌లు

Sridevi

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *