బిగ్ బాస్ దశావతారం.. ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ అంటూ సీజన్ 10 రెడీ అయిపొయింది. బిగ్ బాస్ గేమ్ షో 10 కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ లానే ఇప్పుడు పైసా సామాన్యులకు పెద్ద పీట వేస్తూ కొంతమంది కామనర్స్ ను హౌస్ లోకి పంపనున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న అగ్నిపరీక్ష సీజన్ 2 కామనర్స్ ను ఫిల్టర్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారు. అయితే సామాన్యులకు గట్టి పోటీ ఇచ్చేలా ఈసారి సెలబ్రెటీలలో కూడా క్రేజ్ ఉన్న క్యాండిడేట్స్ ను రంగంలోకి దింపుతున్నారు. అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేది వీరే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది
అయితే వీటిలో ఓ బ్యూటీ పేరు నెట్టింట అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ఇన్నిరోజులు సీరియల్స్ లో తన నటనతో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనుందని తెలుస్తుంది. అంతే కాదు హ్యుజ్ రెమ్యునరేషన్ తో ఆమె బిగ్ బాస్ సీజన్ 10 హౌస్లోకి ఎంట్రీ ఇస్తుందట ఆ అందాల భామ.. ఆమె మరెవరో కాదు దేబ్జానీ మోదక్..
ఇవి కూడా చదవండి
నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ
‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘సత్యభామ’ సీరియల్స్ చూసేవారికి ఈ బ్యూటీ దేబ్జానీ తెలుసు… ఈ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈ బెంగాలీ బ్యూటీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడం దాదాపు ఖరారైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాదు వారానికి రూ. 4 లక్షల రెమ్యునరేషన్ తో హౌస్ లో దేబ్జానీ ఎంట్రీ ఇస్తుందని నెట్టింట టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే బిగ్ బాస్ బాస్ లో దేబ్జానీ అదరగొట్టడం ఖాయం అంటున్నారు ఆమె ఆమె అభిమానులు. ఈ మరి ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
ఆ సినిమాలో ఛాన్స్ అడిగితే ఆ హీరో వద్దు అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన రాజశేఖర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.