విశాఖలో ఆరడుగుల పాము కలకలం రేపింది. ఇంటి చుట్టూ రక్షణ కోసం వేసిన వలలో చిక్కుకొని విలవిల్లాడింది. గాయపడి కొన ఊపిరితో ఉన్న ఆ పామును రెస్క్యూ చేశాడు స్నేక్ క్యాచర్. సపర్యలు చేసి వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించాడు. ఆరు కుట్లు వేసి గాయాలకు చికిత్స చేశాడు వెటర్నరీ వైద్యుడు. శ్రీహరిపురం సమీపంలోని క్రాంతి నగర్. కొండ సమీపంలో ఇల్లు ఉండటంతో.. ఇంటి చుట్టూ రక్షణ కోసం ఇనుప కంచె, వలవేశాడు యజమాని. ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో కానీ ఓ భారీ పాము అందులో చిక్కుకుంది. తీవ్రంగా గాయపడి విలవిల్లాడిపోతోంది. చివరకు ప్రాణం పోయే పరిస్థితి ఎదురైంది ఆ పాముకు. గమనించిన యజమాని దావీదు.. స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు.. ఆ పామును నాగ జెర్రీగా గుర్తించాడు. ఆరడుగుల పొడవు ఉన్న నాగ జెర్రి విష రహిత పాము.. అనంతరం అతి కష్టం మీద ఆ వలలో చిక్కుకున్న పామును బయటకు తీశాడు.
అప్పటికే శరీరంపై బలమైన గాయాలు ఉన్నాయి. తోలు కొన్నిచోట్ల ఊడిపోయింది. మెడ ప్రాంతంలో గాయమైంది. కొన ఊపిరితో ఉన్న ఆ పామును చూసి చలించి పోయాడు స్నేక్ క్యాచర్ నాగరాజు. వెంటనే సిందియా ప్రాంతంలోని వెటర్నరీ వైద్యుడు సునీల్ కుమార్ ను సంప్రదించాడు. హుటాహుటిన పాముకు సపర్యలు చేసి.. వైద్య సాయం అందించారు. గంటన్నర పాటు శ్రమించి.. పాము గాయానికి ఆరు కుట్లు వేశారు. మిగిలిన చోట్ల డ్రెస్సింగ్ చేశారు.
వీడియో చూడండి..
పాము పూర్తిగా కోలుకున్న తర్వాత.. దానిని సురక్షితమైన ప్రదేశంలో విడిచిపెడతామని అంటున్నాడు స్నేక్ కేచర్ నాగరాజు. తీవ్రంగా గాయపడిన పాముకు ప్రాణం పోసేలా సపర్యాలు చేసిన స్నేహ క్యాచర నాగరాజు, వెటర్నరీ వైద్యుడు సునీల్ కుమార్ ను అభినందిస్తున్నారు జంతు ప్రేమికులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..