షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. ఉగ్రవాదం విషయంలో పొరుగు దేశాలపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండా, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, నియామకాలు, తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించడం, సురక్షిత స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను కూల్చివేయాలని ఆయన అన్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) 26వ శిఖరాగ్ర సమావేశం కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగింది.
బిష్కెక్‌లో జరిగిన SCO సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో భేటీ అయ్యారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఇతర SCO నాయకులు హాజరైన రౌండ్‌టేబుల్ చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ఈ కఠినమైన వ్యాఖ్యలు చేశారు.ఈ తీవ్రమైన విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని మనమందరం ఏకతాటిపై మాట్లాడాలి. ఉగ్రవాదాన్ని విధాన సాధనంగా ఉపయోగించుకునే, ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు కల్పించే దేశాలకు గట్టి సందేశం ఇవ్వాలి: ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక ఆస్తిగా ఉండకూడదు,” అని ఆయన అన్నారు. ఫోటో సెషన్ సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కూడా వేదికపై ఉన్నప్పటికీ, ప్రధాని మోదీ ఆయనతో కంటిచూపు లేదు. కలవలేదు.
సదస్సులో తన ప్రసంగంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మనం ఉగ్రవాద వ్యవస్థను, దానికి అందే నిధులను పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని మనం ఏకగ్రీవంగా ప్రకటించాలన్నారు. కొందరు ఉగ్రవాదాన్ని ఒక వ్యూహాత్మక ఆయుధంగా మారుస్తున్నారని ప్రధాని అన్నారు. ఉగ్రవాదాన్ని ఆయుధంగా మార్చకూడదని హెచ్చరించారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, ఘర్షణలకు ముగింపు పలకాలని ప్రధాని మోదీ పిలుపునిస్తూ, యుద్ధభూమిలో ఎలాంటి పరిష్కారం లభించదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అన్ని యుద్ధాలు, వివాదాలు చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
SCO గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశానికి SCO గొప్ప నాగరికత, సంస్కృతి మరియు ఆలోచనల సంగమమని అన్నారు. తన ప్రసంగంలో ప్రధాని మోదీ, మార్కెట్లను అనుసంధానించే, పరస్పర వాణిజ్యాన్ని సులభతరం చేసే, అభివృద్ధికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. అనుసంధాన ప్రయత్నాలు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కూడా ఆయన చెప్పారు.
కిర్గిజ్ రాజధానిలో జరిగిన ఈ చర్చలో ప్రధాని మోదీ, షరీఫ్‌లతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో, కజకిస్తాన్ అధ్యక్షుడు కాస్సిమ్-జోమార్ట్ టోకాయెవ్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్, తజిక్ అధ్యక్షుడు ఎమోమాలి రహమాన్ పాల్గొన్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
#WATCH किर्गिस्तान: प्रधानमंत्री नरेंद्र मोदी ने बिश्केक में 26वें शंघाई कोऑपरेशन ऑर्गनाइज़ेशन (SCO) समिट में चीनी राष्ट्रपति शी जिनपिंग और रूसी राष्ट्रपति व्लादिमीर पुतिन से मुलाकात की।
(सोर्स: होस्ट ब्रॉडकास्टर वाया रॉयटर्स) pic.twitter.com/HgC52HZcoK
— ANI_HindiNews (@AHindinews) September 1, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..