Headlines

BCCI Chief Selector: రోహిత్ శర్మకు దిమ్మతిరిగే షాక్.. బీసీసీఐ చీఫ్‌గా అగార్కర్‌కు మరో ఛాన్స్‌..? | Bcci chief selector ajit agarkar post extension for 2027 world cup


BCCI Chief Selector: భారత జట్టు ఆప్ఘాన్ టీంతో సిరీస్ కోసం బిజీగా మారింది. ఈ క్రమంలో టీం స్వ్కాడ్ 3వ తేదీన ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పదవీకాలం ముగుస్తుండడంతో.. ఆయన భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్‌ సన్నాహకాలు ఇప్పటికే మొదలవ్వడంతో.. అగార్కర్‌ను మరో ఏడాది పాటు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డులోని ఓ వర్గం ఆయనను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపస్తున్నాయి. టీమిండియా మాజీ ప్లేయర్ అజిత్‌ అగార్కర్‌ ప్రస్తుతం భారత పురుషుల సీనియర్‌ సెలక్షన్‌ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుత కాంట్రాక్ట్‌ 2026 సెప్టెంబర్‌లో ముగియనుంది. దీంతో 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు ఆయనను కొనసాగించడంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. అగార్కర్‌కు మరో ఏడాది గడువు ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం సమావేశం అనంతరం తీసుకోనున్నారు. అంతేకాదు.. ఈ బాధ్యతను కొనసాగించాలా? వద్దా? అనే విషయంలో అగార్కర్‌ అభిప్రాయం కూడా కీలకం కానుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్‌లో సర్పంచ్ సాబ్ ప్లేస్..!

ఇవి కూడా చదవండి



అగార్కర్‌ హయాంలో భారత జట్టు పరిస్థితి..

2023లో చీఫ్‌ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీకి కొన్ని అద్భుత విజయాలు సాధించింది. భారత్‌ 2024 టీ20 ప్రపంచకప్‌, 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్‌ సాధించింది. దీంతో వైట్‌బాల్‌ క్రికెట్‌లో జట్టు విజయాల్లో సెలక్షన్‌ కమిటీ పాత్రపై ప్రశంసలు వచ్చాయి.

2027 వన్డే ప్రపంచకప్‌ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ఏడాది మాత్రమే సమయం ఉండటంతో సెలక్షన్‌ కమిటీలో స్థిరత్వాన్ని కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి.

విమర్శలు కూడా..

అయితే అగార్కర్‌ పదవీకాలం పూర్తిగా విజయవంతంగా సాగిందని చెప్పలేం. టెస్టు క్రికెట్‌లో భారత్‌కు ఎదురైన కొన్ని పరాజయాలు సెలక్షన్‌ విధానంపై ప్రశ్నలు లేవనెత్తాయి. న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ ఓటమి, బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో నిరాశాజనక ప్రదర్శన కూడా ఉంది.

అదే సమయంలో సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ విషయంలో సెలక్షన్‌ కమిటీ నిర్ణయాలపైనా విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా రోహిత్‌ శర్మ వన్డే భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి బీసీసీఐలోని కొన్ని వర్గాలు, సెలక్షన్‌ కమిటీ మధ్య చర్చలకు దారితీసినట్లు సమాచారం.

గంభీర్‌ అభిప్రాయం కీలకమా..?

అగార్కర్‌ కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే ముందు భారత ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయాన్ని కూడా బీసీసీఐ తీసుకునే అవకాశం ఉందని సమాచారం. గత రెండేళ్లుగా గంభీర్‌, అగార్కర్‌ కలిసి జట్టు పునర్నిర్మాణంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఎక్కువమంది చదివినది: Video: 6 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం.. 26 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్‌తో కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా..?

ముఖ్యంగా సీనియర్‌ ఆటగాళ్ల తర్వాతి తరం వైపు భారత జట్టును తీసుకెళ్లే క్రమంలో ఇద్దరూ కలిసి పనిచేశారు. అగార్కర్‌ తీసుకున్న కఠిన నిర్ణయాలను గంభీర్‌ గతంలో ప్రశంసించిన సందర్భాలూ ఉన్నాయి. అందువల్ల గంభీర్‌ నుంచి సానుకూల అభిప్రాయం వస్తే అగార్కర్‌ కొనసాగింపునకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది.

తుది నిర్ణయం బీసీసీఐదే..

ప్రస్తుతం అగార్కర్‌ కొనసాగింపు అధికారికంగా ఖరారు కాలేదు. బీసీసీఐ సమావేశం తర్వాతే స్పష్టత రానుంది. అయితే 2027 ప్రపంచకప్‌ వంటి కీలక టోర్నీ ముందు సెలక్షన్‌ కమిటీకి స్థిరత్వం ఇవ్వాలనే ఆలోచన బోర్డులో ఉన్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *