
హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన నందులాల్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే జైద్ షా ఖాద్రీ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ఈ ఘటనకు కారణమైన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు మెంబర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను అరెస్ట్ చేశారు.