క్యాన్సర్, విడాకులు, రెండో పెళ్లి వంటి విషయాలపై ఆమె స్పష్టతనిచ్చారు. గతంలో తనకు క్యాన్సర్ వచ్చినట్లు వచ్చిన వార్తలు కేవలం నిరాధారమైన పుకార్లు మాత్రమేనని ప్రేమ స్పష్టం చేశారు. తాను న్యూజిలాండ్‌లో ఉన్న సమయంలో ఈ వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయని, అయితే అవి నిజం కాదని ప్రేమ తెలిపారు. తప్పుడు వార్తలు తనను మరింత బలపడేలా చేశాయని, తన తల్లిదండ్రుల మద్దతు కూడా తనలో ధైర్యాన్ని నింపిందని ప్రేమ అన్నారు.