Headlines

Manjummel Boys: మంజుమ్మల్‌ బాయ్స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు | No Sequel, No Remake: ‘Manjummel Boys’ Director Shuts Down Speculation video tv9d – Entertainment Videos in Telugu

Manjummel Boys: మంజుమ్మల్‌ బాయ్స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు | No Sequel, No Remake: ‘Manjummel Boys’ Director Shuts Down Speculation video tv9d – Entertainment Videos in Telugu


ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ‘మంజుమ్మల్ బాయ్స్’ బాక్సాఫీస్ సక్సెస్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. 240 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మలయాళ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ఈ చిన్న సినిమా. గుణ కేవ్స్ నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్.. కేవలం మలయాళంలోనే కాదు, సౌత్ ఇండియన్‌ లాంగ్వేజెస్ అన్నింటిలో బిగ్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమా సీక్వెల్, రీమేక్‌కు సంబంధించి డిస్కషన్‌ జరుగుతోంది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు బడా నిర్మాణ సంస్థలు ట్రై చేస్తున్నారు. ఒరిజినల్ వర్షన్‌ను డైరెక్ట్ చేసిన చిదంబరం కెప్టెన్సీలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఆఫర్స్‌ను దర్శకుడు లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికే హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశామని, మళ్లీ హిందీలో రీమేక్ చేయడం కరెక్ట్ కాదని ఆయన తేల్చి చెప్పారు. సినిమాకు ఉన్న సోల్‌ రీమేక్ చేస్తే మిస్ అవుతుందన్నారు. మంజుమ్మల్ బాయ్స్ 2 గురించి కూడా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్‌. ‘మనం అంత క్రూరంగా ఎందుకు ఉండాలి? ఆ కుర్రాళ్లు మళ్లీ ఇంకో ప్రమాదంలో పడితేనే కదా సీక్వెల్ సాధ్యమయ్యేది’ అంటూ సెటైర్ వేశారు. ఈ సినిమాకు ఉన్న మెయిన్ అట్రాక్షన్ అది నిజంగా జరిగిన సంఘటన కావడమేనని, సీక్వెల్ చేయాలన్న ఉద్దేశంతో ఫిక్షనల్ స్టోరీ చేస్తే ఈ స్థాయలో మెప్పించదన్నారు. అంటే ఈ బ్లాక్‌బస్టర్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ సీక్వెల్ ఛాన్స్ లేనట్లే అని తేల్చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *