Headlines

Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్ | Dhanush Eyes Another Telugu Director After ‘Kuberaa’ Success video tv9d – Entertainment Videos in Telugu

Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్ | Dhanush Eyes Another Telugu Director After ‘Kuberaa’ Success video tv9d – Entertainment Videos in Telugu


ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల మీద ఫోకస్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తూనే.. తెలుగు దర్శకులతో బాక్సాఫీస్ దగ్గర బిగ్ సౌండ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్న ధనుష్‌, ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్, సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ సక్సెస్ ఇచ్చిన కిక్‌తో టాలీవుడ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారు. సర్‌ తరువాత మరో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ మూవీ చేశారు. కింగ్ నాగార్జున కీ రోల్‌లో నటించిన ఈ సినిమా టాలీవుడ్‌లో ధనుష్‌ మార్కెట్‌ను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లింది. ప్రజెంట్ కోలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ధనుష్‌ మరో తెలుగు డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా అఖిల్ హీరోగా లెనిన్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరి, తన నెక్ట్స్ మూవీని ధనుష్‌తో ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మురళీకిశోర్, ధనుష్‌కు కథ కూడా వినిపించారన్న ప్రచారం జరుగుతోంది. లెనిన్‌లో రూరల్ బ్యాక్‌డ్రాప్‌ను అద్భుతంగా తెరకెక్కించిన మురళీకిశోర్.. ధనుష్ కోసం కూడా అలాంటి కథనే సిద్ధం చేశారట. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో ఉండటంతో, త్వరలోనే ధనుష్‌కు పూర్తి కథను వినిపించి ఫైనల్‌ కాల్ తీసుకునే ప్లాన్‌లో ఉన్నారు మురళీకిశోర్. గతంలో ధనుష్‌తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్‌లోనే ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ డిస్కషన్ స్టేజ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని డిటైల్స్‌ త్వరలో వెల్లడించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *