Headlines

Pawan Kalyan: పవన్ బర్త్ డేకు భారీ ప్లాన్.. ఇట్స్ OG టైమ్..! | Pawan Kalyan’s Birthday to Bring a Big OG 2 Surprise Makers Plan Special Update video – Entertainment Videos in Telugu

Pawan Kalyan: పవన్ బర్త్ డేకు భారీ ప్లాన్.. ఇట్స్ OG టైమ్..! | Pawan Kalyan’s Birthday to Bring a Big OG 2 Surprise Makers Plan Special Update video – Entertainment Videos in Telugu


హీరోల బర్త్ డే వస్తే కానీ సినిమా అప్‌డేట్ ఇవ్వాలని దర్శక నిర్మాతలకు అనిపించదా..? ఓ టీజరో, పోస్టరో విడుదల చేయాలంటే కచ్చితంగా ఆ స్టార్ పుట్టిన రోజు కానీ, ఏదైనా స్పెషల్ అకేషన్ కానీ రావాల్సిందేనా..? అలా వస్తే కానీ సినిమా అప్‌డేట్ ఇచ్చే మూడ్ మన మేకర్స్‌కు రాదా..? తాజాగా పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇదే జరగబోతుంది. ఓజి 2 అప్‌డేట్ కోసం అకేషన్ ఫిక్సైంది. ఈ మధ్య మన దర్శకులు మరీ కమర్షియల్ అయిపోతున్నారు.. ఓ సినిమా అప్‌డేట్ ఇవ్వాలంటే కచ్చితంగా బర్త్ డేనో లేదంటే ఏదైనా స్పెషల్ అకేషనో రావాలంటున్నారు. ఆ మధ్య విజయ్ దేవరకొండ పెళ్లప్పుడు సడన్‌గా ఏందయ్యా సామీ అంటూ రణబాలి ప్రమోషన్ చేసారు.. రేపు చిరంజీవి బర్త్ డేకు ఆగస్ట్ 22న విశ్వంభర టీజర్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇదే జరగబోతుంది. సెప్టెంబర్ 2న ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు సుజీత్. ఈ మధ్యే ఓజి 2 సినిమాను ప్రకటించారు ఇద్దరూ. సుజీత్ ఫోకస్ అంతా ఓజి 2 కథపైనే ఉంది. సినిమాకు ప్రీ ప్రొడక్షన్ కూడా జోరుగానే జరుగుతుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు కానుకగా ఓజి 2 స్పెషల్ వీడియో రానుంది. ఓజి 2 కోసం ప్రత్యేకంగా ఓ యానిమేటెడ్ వీడియోను ప్లాన్ చేస్తున్నారు సుజీత్. ఈ దర్శకుడికి మొదట్నుంచీ యానిమేషన్ మీదే ఎక్కువగా గురి ఉంది. ఓజి పాటల్లోనూ ఎక్కువగా యామినేటెడ్ స్టిల్స్ ఉంటాయి. ఆ మధ్య నాని బ్లడీ రోమియో మోషన్ పోస్టర్ కూడా యానిమేటెడే. ఇప్పుడు ఓజి 2 విషయంలోనూ ఇదే చేస్తున్నారీయన. కథపై క్లారిటీ ఇస్తూ వీడియో రెడీ చేస్తున్నారు. ఓజి సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తే.. సీక్వెల్‌ను మాత్రం పవన్ కళ్యాణ్ సోలోగా నిర్మిస్తున్నారు. కథ నచ్చి దర్శకుడికి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేసారు పవర్ స్టార్. ఈ సినిమా కోసం పవన్ 70 రోజులకు పైగానే డేట్ ఇచ్చినట్లు టాక్ నడుస్తుంది. అన్నీకుదిర్తే సెప్టెంబర్ నుంచే రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. మొత్తానికి ఈసారి పవన్ బర్త్ డేకు బ్లాస్ట్ అయితే మామూలుగా ఉండదని అర్థమవుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *