Headlines

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అభిమాని మృతి.. గొప్ప మనసు చాటుకున్న నిర్మాత ఎస్కేఎన్.. భారీ ఆర్థిక సాయం | Producer SKN Provides 2 Lakh Financial Assistance To Pawan Kalyan Fan Family, Details Inside


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజంటే అభిమానులు ఒక పండగలా భావిస్తారు. ఊరు వాడా కేక్ కటింగ్ లతో పాటు రక్తదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు పవన్ ఫ్యాన్స్. అలా ఈసారి కూడా పవన్ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు అభిమానులు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే దురదృష్టవశాత్తూ ఈ వేడుకల్లో ఒక అపశ్రుతి చోటు చేసుకుంది. అమలాపురంకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ అనే అభిమాని ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న ప్రముఖ నిర్మాత ప్రేమ్ కుమార్ కుటుంబానికి అండగా నిలిచారు. మృతుని కుటుంబానికి రూ. 2లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎస్కేఎన్..

‘నేను కూడా ఒకప్పుడు బ్యానర్లు కడుతూ, అభిమానిగా మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాను. అందుకే ఒక అభిమాని బాధ నాకు ఎంత దగ్గరగా ఉంటుందో నాకు తెలుసు.అందులోనూ మన హీరో పుట్టినరోజు రోజునే మన అభిమాని ప్రేమ్ కుమార్ ఇలా అకాలంగా మనకు దూరమవ్వడం ఎంతో బాధ కలిగించింది. ఈ కష్ట సమయంలో నేను ఆయన కుటుంబం పక్కన ఒక అభిమానిగా, ఒక మనిషిగా నిలబడాలని అనుకుంటున్నాను. వారి బాధను తీర్చలేకపోయినా, నా వంతుగా ఒక చిన్న ఆర్థిక సహాయం 2,00,000 అందించడం ద్వారా నా సంఘీభావాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. మన అభిమాని కుటుంబానికి మనమంతా అండగా నిలుద్దాం’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు ఎస్కేఎన్.

ఇవి కూడా చదవండి



నిర్మాత ఎస్కేఎన్ పోస్ట్..

‘బేబీ’ నిర్మాత షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చాలా మంచి పని చేశారంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఎస్కేఎన్ ఇలా చేయడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు అభిమానులు చనిపోయినప్పుడు కూడా మృతుల కుటుంబాలకు తన వంతు ఆర్థిక సాయం అందజేశారు. దీంతో ఈ టాలీవుడ్ నిర్మాతపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *