Headlines

Kalpana Rai: పుట్టుకతోనే కోటీశ్వరురాలు.. 400కు పైగా సినిమాలు.. కానీ చివరి రోజుల్లో చితికి డబ్బుల్లేక.. | Did You Remember Tollywood Actress Kalpana Rai, Know About Her Life Struggles And Tragic Death


తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నలేడీ కమెడియన్లలో కల్పనా రాయ్ ఒకరు. తన యాస, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారామె. తెలుగులో దాదాపు 430కు పైగా సినిమాల్లో కల్పానా రాయ్ నటించారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, మోహన్ బాబు.. ఇలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. ఓ సీత కథ, హిట్లర్, ప్రేమించుకుందాం రా, ఆపద్బాంధవుడు, నారీ నారీ నడుమ మురారి, శ్రీనివాస కల్యాణం, జానకి రాముడు, జంబ లకిడి పంబ తదితర సినిమాలు కల్పానా రాయ్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తెలుగు నాట కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె చివరి రోజుల్లో అనాథలా కన్నుమూశారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. కల్పనా రాయ్ పుట్టుకతోనే కోటీశ్వరురాలు. చాలా ధనవంతుల కుటుంబంలోనే ఆమె జన్మించారు. తల్లిదండ్రులు ఆమెకు ఒళ్లంతా బంగారం చేయించారని ఒక ప్రముఖ సీనియర్ రచయిత ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే దురదృష్టకరమైన విషయమేమిటంటే.జ కల్పనా రాయ్ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. ఇదే అదనుగా చూసుకుని బంధువులు ఆమె ఆస్తిని పూర్తిగా చేతుల్లోకి తీసేసుకున్నారట.

అయినా నిరాశ చెందని కల్పానారాయ్ నటి శారద సహాయంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. వందలాది సినిమాలు చేసి మంచి గానే సంపాదించింది. అయితే ఇక్కడే విధి ఆమెను చిన్నచూపు చేసింది. కల్పానా రాయ్ మోహన్ రాయ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి చేసుకోకుండానే అతనితో కలిసి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే మోహన్ కల్పనా రాయ్ ని మోసం చేసి తనదారి తాను చూసుకున్నాడు. అయినా కుంగిపోని కల్పనా సింగిల్ మదర్ గా తన కూతురును కష్టపడి పెద్దది చేసింది. కానీ చివరకు కూతురు కూడా పెద్దయ్యాక ఓ వ్యక్తిని ప్రేమించి అతనితో వెళ్లిపోయింది. తల్లిని ఒంటరిగా చేసింది. ఇది కల్పానాను బాగా కుంగదీసింది. దీనికి తోడు బరువు పెరగడంతో తీవ్ర అనారోగ్య సమస్యలు కల్పానారాయ్ ను వెంటాడాయి. ఎవ్వరూ తోడు లేకపోవడం తో ఆమె ఆరోగ్యం క్రమ క్రమంగా క్షీణించింది. చివరికి ఆకలితో అల్లాడి ఇంట్లోనే ఒంటరిగా మరణించారు. చివరకు ఆమె అంత్యక్రియలని కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రతినిధులు పూర్తి చేయడం శోచనీయం.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *