Headlines

అమ్మో ఒకటో తారీఖు.. భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర! | Commercial LPG Cylinder Prices Hiked Again in September: Hyderabad Nears rs 3,000, Domestic Cylinder Unchanged video tv9d – Business Videos in Telugu


ప్రస్తుతకాలంలో సామాన్యులకు నిజంగానే అమ్మో ఒకటో తారీఖు అనేలా పరిస్థితులు మారుతున్నాయి. ఓవైపు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు గుండెల్లో గుబులు రేపుతుంటే.. ఒకటో తారీఖు రాగానే గ్యాస్‌బండ ధర గుదిబండలా మారుతోంది. సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే వ్యాపార వర్గాలకు ఆయిల్ కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను మళ్లీ పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్ల నిర్వహణ మరింత భారం కానుంది. పెరిగింది కమర్షియల్‌ సిలిండర్‌ ధరే అయినా దాని ప్రభావం సామాన్య ప్రజలపైనా పడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ టిఫిన్‌ సెంటర్లు, కర్రీపాయింట్లపై ఆధారపడుతున్నవారు చాలామంది ఉన్నారు. కమర్షియల్ సిలిండర్‌ ధరలు పెరిగితే ఆటోమేటిగ్గా వీటి ధరలు కూడా పెరుగుతాయి. ఇక ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.9.50 పెరిగి రూ.2,747.50కి చేరింది. ముంబైలో కూడా రూ.9.50 పెంపుతో కొత్త ధర రూ.2,701 వద్దకు ఎగబాకింది. కోల్‌కతాలో పదకొండున్నర రూపాయలు పెరిగి రూ.2,884కి చేరుకోగా, చెన్నైలో రూ.10.50 పెరిగి రూ.2,916.50 అయింది. ఇక హైదరాబాద్‌లో ఏకంగా రూ.11 మేర పెరగడంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,000కు చేరువైంది. గత నెలలో ధరలు తగ్గాయని ఆశపడిన వ్యాపారులకు ఈ తాజా పెంపు నిరాశ కలిగించింది. అయితే, కోట్లాది గృహిణులకు ఆయిల్ కంపెనీలు ఊరటనిచ్చాయి. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. ఎలాంటి పెంపు లేకుండా పాత ధరలే కొనసాగుతుండటంతో మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం లభించినట్లయింది. వాణిజ్య వర్గాలపై మాత్రం ఈ ధరల పెరుగుదల గట్టి ప్రభావం చూపనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాకినాడలో లవ్‌ జీహాద్‌ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం

“జలం… జీవం – జీవితం! ఆకట్టుకుంటున్న సీఎం చంద్రబాబు పోస్ట్

దుమ్మురేపేలా పవన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. సీఎం చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు

అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్‌లైన్‌లోనే పెద్దల ఆశీస్సులు!

వెయ్యి రోజుల పాలన.. ఫ్రీగా ఉల్లిగడ్డల పంపిణీ! వరంగల్‌లో కాంగ్రెస్ నేత వినూత్న సంబరాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *