Headlines

Cinema : రూ.180 కోట్ల కలెక్షన్లతో సంచలనం.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ సినిమా.. యూట్యూబ్‏లో ఫ్రీగా చూడొచ్చు.. | This 180 Crore Collections Block Buster Movie Now Trending In OTT and You Tube, That Is Stree Movie


సినిమా ప్రియులకు, ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ జోనర్ అభిమానులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఎన్నో విభిన్నమైన చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్రపంచంలో కూడా సెన్సేషన్ సృష్టించిన హారర్ చిత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్, రూ. 180 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఒక ది బెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. ఈ చిత్రం కేవలం సాధారణ దయ్యం కథలే కాకుండా, సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మిస్టరీలతో రూపుదిద్దుకుంది. ఒక రహస్యమైన నేపథ్యం, అనూహ్యమైన మలుపులు, ఈ సినిమాకు ప్రధాన బలం. సాధారణ హారర్ సినిమాల్లో కనిపించే జంప్ స్కేర్లు మాత్రమే కాకుండా, ప్రేక్షకుడిని కథలో మమేకం చేసే కథనం , భయాందోళనకు గురిచేసే నేపథ్య సంగీతం ఈ చిత్రాన్ని వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయి.

ఎక్కువ మంది చదివినవి : Yeshanagula : . ఈ పాటలో ఇంత అర్ధం ఉందా.. ఏశనాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్‏కు అర్థం ఇదే..

సినిమా ప్రారంభం నుంచే ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ముగింపు వరకు సస్పెన్స్ వీడకుండా దర్శకుడు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. కథానాయకుడు,నటీనటుల అత్యుత్తమ నటన, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX), భయాందోళన గొలిపే సౌండ్ డిజైనింగ్ ఈ చిత్రాన్ని సాంకేతికంగా కూడా ఎంతో ఉన్నతంగా నిలబెట్టాయి. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు స్త్రీ. బాలీవుడ్ స్టార్స్ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించారు. ఇందులో పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ కీలకపాత్రలు పోషించారు.

ఎక్కువ మంది చదివినవి : 2026లోనే అట్టర్ ప్లాప్.. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ట్రెండింగ్ నంబర్ వన్.. ఏ మూవీ అంటే..

రూపొందించిన బడ్జెట్‌తో పోలిస్తే అంతర్జాతీయ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 180 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. విమర్శకుల నుంచి, సామాన్య ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు విశేష ఆదరణ లభించింది. థియేటర్లలో భారీ విజయం సాధించిన అనంతరం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టిన ఈ సినిమా, డిజిటల్ స్ట్రీమింగ్‌లోనూ ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాదు యూట్యూబ్ లోనూ ఫ్రీగా ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.

ఎక్కువ మంది చదివినవి : Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *