Headlines

Janmashtami: జన్మాష్టమికి మీ చిన్నారిని బాలకృష్ణుడిగా మార్చేయండి.. ఈ AI ప్రాంప్ట్‌లతో అద్భుతమైన ఫొటోలు! | Janmashtami 2026: 10 ChatGPT, Gemini AI Prompts To Transform Your Child’s Photo Into Little Krishna


Janmashtami: జన్మాష్టమి సందర్భంగా పిల్లల ఫొటోలను AI సాయంతో బాలకృష్ణుడి అవతారంలోకి మార్చుకోవచ్చు. ChatGPT, Gemini, Grok వంటి AI టూల్స్‌లో చిన్నారి ఫొటోను అప్‌లోడ్ చేసి, ప్రత్యేకమైన ప్రాంప్ట్‌ను ఇస్తే ఫొటోరియలిస్టిక్‌, పెయింటింగ్‌, 3D యానిమేషన్‌ వంటి విభిన్న శైలుల్లో చిత్రాలను రూపొందించుకోవచ్చు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నారులను పసుపు రంగు ధోతి, నెమలి పింఛం, కిరీటంతో అలంకరించడం మన దేశంలో చాలాకాలంగా ఉన్న సంప్రదాయం. ఇప్పుడు ఈ సంప్రదాయానికి కృత్రిమ మేధ (AI) టెక్నాలజీ కూడా తోడైంది. పిల్లల సాధారణ ఫొటోలను AIతో అందమైన బాలకృష్ణుడి చిత్రాలుగా మార్చుకుని సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతోపాటు గ్రీటింగ్‌ కార్డులు, ఫ్రేమ్‌ ప్రింట్లు, వాల్‌పేపర్లుగా కూడా ఉపయోగించుకుంటున్నారు.

AIలో ఫొటో ఎలా తయారు చేసుకోవాలి?

ముందుగా మీ చిన్నారి స్పష్టమైన, ముందు వైపు చూస్తున్న ఫొటోను ChatGPT, Gemini లేదా Grok వంటి AI ఇమేజ్‌ జనరేషన్‌ టూల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత కింది ప్రాంప్ట్‌లలో మీకు నచ్చినదాన్ని కాపీ చేసి ఇవ్వాలి.

1. గోకులంలో బాలకృష్ణుడు:

ప్రాంప్ట్: అప్‌లోడ్ చేసిన ఫొటోలోని చిన్నారిని బాలకృష్ణుడిగా మార్చండి. ముఖ కవళికలు, కళ్ల ఆకారం, ముఖ పోలికలను సాధ్యమైనంత వరకు అలాగే ఉంచండి. బంగారు అంచులతో కూడిన పసుపు రంగు పట్టు ధోతి, బంగారు కిరీటం, నెమలి పింఛం, ముత్యాల ఆభరణాలు ధరింపజేయండి. పక్కన వెన్నతో కూడిన మట్టి కుండ ఉండేలా గోకుల వాతావరణాన్ని సృష్టించండి. సహజమైన వెలుతురు, సినిమాటిక్ ఫొటో రియలిజం ఉండాలి.

ఇవి కూడా చదవండి



2. వెన్న తింటున్న చిన్నికృష్ణుడు:

ప్రాంప్ట్: ఈ ఫొటోలోని చిన్నారిని వెన్న తింటూ అల్లరి చేస్తున్న బాలకృష్ణుడిగా మార్చండి అంటూ ప్రాంప్ట్ ఇవ్వండి. చిన్నారి ముఖాన్ని అలాగే ఉంచండి. చెంపపై కొద్దిగా వెన్న అంటుకున్నట్లు చూపించండి. చుట్టూ సంప్రదాయ భారతీయ గ్రామీణ వంటగది, వేలాడుతున్న మట్టి కుండలు ఉండాలి. వెచ్చని వెలుతురుతో అందమైన ఆయిల్‌ పెయింటింగ్‌ తరహా రూపాన్ని ఇవ్వండి. అని ప్రాంప్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

3. క్యూట్‌ 3D బాలకృష్ణుడు:

ప్రాంప్ట్: ఫొటోలోని చిన్నారిని అందమైన 3D యానిమేషన్‌ తరహా బాలకృష్ణుడిగా మార్చండి. ముఖం, కళ్ల ఆకారం, చిరునవ్వు పోలికలు ఉండేలా చూడండి. తలపై చిన్న నెమలి పింఛం, చేతిలో వేణువు ఉండాలి. ప్రకాశవంతమైన రంగులు, అందమైన నేపథ్యం, క్యూట్‌ మరియు ఆకర్షణీయమైన రూపం ఇవ్వండి.

4. వాటర్‌కలర్‌ బాలకృష్ణుడు:

ప్రాంప్ట్: అప్‌లోడ్ చేసిన ఫొటోలోని చిన్నారిని యువకృష్ణుడిగా చూపిస్తూ అందమైన వాటర్‌కలర్‌ పెయింటింగ్‌గా మార్చండి. ముఖ పోలికను కొనసాగించండి. చుట్టూ తామర పువ్వులు, మృదువైన రంగులు, తల చుట్టూ స్వల్పంగా బంగారు కాంతి ఉండాలి. కలల ప్రపంచాన్ని తలపించే పెయింటింగ్‌ శైలి ఉండాలి. అని ఇవ్వండి.

5. ఊయలపై రాజకుమారుడిలా:

ప్రాంప్ట్: “చిన్నారిని పూలమాలలతో అలంకరించిన అందమైన చెక్క ఊయలపై కూర్చున్న బాలకృష్ణుడిగా మార్చేలా ప్రాంప్ట్‌ ఇవ్వండి. అలాగే నీలం, బంగారు రంగుల పట్టు దుస్తులు, ముత్యాల హారం ధరించినట్లు చూపించండి. ముఖంలో అందమైన చిరునవ్వు ఉండాలి. పండుగ వాతావరణంతో ఫొటోరియలిస్టిక్‌ చిత్రంగా రూపొందించండి.

6. యమునా నది ఒడ్డున వేణుగానం:

ప్రాంప్ట్: ఈ ఫొటోలోని చిన్నారిని యమునా నది ఒడ్డున వేణువు వాయిస్తున్న బాలకృష్ణుడిగా మార్చండి. వెనుక సూర్యాస్తమయ దృశ్యం, పచ్చని చెట్లు, ప్రశాంతంగా మేస్తున్న ఆవులు ఉండాలి. గోల్డెన్‌ అవర్‌ లైటింగ్‌, సినిమాటిక్‌ కెమెరా యాంగిల్‌, ఫొటోరియలిస్టిక్‌ నాణ్యత ఉండాలి. అని ప్రాంప్ట్‌ ఇవ్వండి.

7. భారతీయ మినియేచర్‌ పెయింటింగ్‌:

ప్రాంప్ట్: అప్‌లోడ్ చేసిన ఫొటోలోని చిన్నారిని క్లాసికల్‌ ఇండియన్‌ మినియేచర్‌ పెయింటింగ్‌ శైలిలో బాలకృష్ణుడిగా మార్చండి. సూక్ష్మమైన బ్రష్‌ స్ట్రోక్స్‌, బంగారు అలంకరణలు, ఇండిగో మరియు కాషాయ రంగులు ఉపయోగించండి. తామర పువ్వుపై కూర్చుని, చేతిలో తామర మొగ్గ పట్టుకున్నట్లు చూపించండి.

8. దహీ హండీతో జన్మాష్టమి గ్రీటింగ్‌ కార్డు:

ప్రాంప్ట్: ఫొటోలోని చిన్నారిని కృష్ణుడి వేషధారణలో చూపిస్తూ జన్మాష్టమి గ్రీటింగ్‌ కార్డు తరహా చిత్రాన్ని రూపొందించండి. పైన అలంకరించిన దహీ హండీ, చుట్టూ దీపాలు, పండుగ అలంకరణలు, రంగురంగుల కన్ఫెట్టి ఉండాలి. ప్రకాశవంతమైన, ఆనందకరమైన పండుగ వాతావరణం కనిపించాలి.

9. వెన్నెల్లో దివ్య బాలకృష్ణుడు:

ప్రాంప్ట్: చిన్నారిని పౌర్ణమి వెన్నెలలో కనిపించే దివ్య బాలకృష్ణుడిగా మార్చండి. ముఖ పోలికను అలాగే ఉంచండి. కిరీటంలో మెరిసే నెమలి పింఛం, స్వల్పమైన నీలి వర్ణ ఛాయ, వెనుక నక్షత్రాలతో కూడిన ఆకాశం ఉండాలి. ప్రశాంతమైన, ఆధ్యాత్మికమైన, అత్యంత వివరాలతో కూడిన ఫొటోలా రూపొందించండి.

10. వెన్న కుండ వైపు పాకుతున్న చిన్నికృష్ణుడు:

ప్రాంప్ట్: అప్‌లోడ్ చేసిన ఫొటోలోని చిన్నారిని ఒరిగిపోయిన వెన్న కుండ వైపు పాకుతూ వెళ్తున్న క్యూట్‌ బాలకృష్ణుడిగా మార్చండి. చిన్నారి ముఖంలో అమాయకత్వం, ఆనందం కనిపించాలి. మెరిసే నేల, మృదువైన స్టూడియో లైటింగ్‌, పసుపు మరియు బంగారు రంగుల ప్రాధాన్యత, హైపర్‌ రియలిస్టిక్‌ ఫొటో నాణ్యత ఉండాలి.

మీ చిన్నారి ఫొటోకు మరింత సహజమైన ఫలితం రావాలంటే..

AIలో ఫొటోను మార్చేటప్పుడు స్పష్టమైన, మంచి వెలుతురులో తీసిన ఫొటోను ఉపయోగించడం మంచిది. ముఖం కెమెరా వైపు ఉండే ఫొటో అయితే పోలికను నిలబెట్టుకోవడం సులభంగా ఉంటుంది. అలాగే ప్రాంప్ట్‌లో “ముఖ పోలికను అలాగే ఉంచాలి. కళ్ల ఆకారం, చిరునవ్వు మారకూడదు వంటి సూచనలు ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. జన్మాష్టమి సందర్భంగా మీ పిల్లల సాధారణ ఫొటోలను ఇలా ప్రత్యేకమైన బాలకృష్ణుడి అవతారాల్లోకి మార్చుకుని కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. అయితే పిల్లల ఫొటోలను AI సేవల్లో అప్‌లోడ్ చేసే ముందు ఆయా ప్లాట్‌ఫామ్‌ల ప్రైవసీ, డేటా వినియోగ నిబంధనలు పరిశీలించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *