ఎన్నోసార్లు అవసరమైన వారిని ఆదుకుని ‘రియల్ హీరో’ అనిపించుకున్న సోనూసూద్ ఇప్పుడు నేపాల్‌కు కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తన బృందంతో కలిసి నేరుగా ఖాట్మండుకు వెళ్లి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. వరద బాధితులకు ఆహారం, దుప్పట్లు ఇతర నిత్యావసరాలను అందిస్తూ వారి కన్నీటిని తుడిచే ప్రయత్నం చేశారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న సోనూ సూద్.. ‘మనమంతా కలసి వారికి ఓ కొత్త జీవితాన్ని అందిద్దాం. నేపాల్.. నువ్వు ఒంటరివి కావు’ అని భరోసా నిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వీటిని చూసిన కొందరు జర్నలిస్టులు సోనూ సూద్ పై విమర్శలు కురిపిస్తున్నారు. కేవలం సెల్ఫ్ మార్కెటింగ్ కోసమే ఇలా చేస్తున్నారంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ‘ఇప్పటికిప్పుడు నేపాల్ వెళ్లి అక్కడి పిల్లలకు రక్షకుడిగా మారిపోయారా? ఇది పూర్తిగా ప్రచారం మాత్రమే. పనులు సరిగ్గా ప్రారంభించక ముందే ఆయనను దేవుడిగా చిత్రీకరించే మార్కెటింగ్ మొదలైంది’ అని ఒకరు ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ పెట్టారు. దీనిపై సోనూ సూద్ కూడా స్పందించాడు. అనంతరం ఇలా సదరు నెటిజన్ కు ఇలా రిప్లై ఇచ్చారు..
ఇవి కూడా చదవండి
‘ ‘‘సోదరా.. మీరు చాలా మంచి వారు. నేపాల్‌కు రండి. మనమిద్దరం కలిసి అక్కడి ప్రజలకు సహాయం చేద్దాం’ అని పిలుపునిచ్చారు సోనూసూద్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తనను విమర్శించిన వారిని సైతం ఏమీ అనకుండా కలిసి సహాయక చర్యల్లో పాల్గొందాం అని కోరిన సోనూ సూద్ పై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. కాగా మంచి పనులు చేస్తోన్న సోనూ సూద్ పై ఇలాంటి విమర్శలు, ట్రోల్స్ రావడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలోనూ ఈ రియల్ హీరోపై కొందరు నెగెటివ్ కామెంట్స్, పోస్టులు పెట్టారు. అయినా వాటిని హుందాగానే స్వీకరించారు సోనూసూద్. ఇప్పుడు కూడా అలాగే చేసి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు సోనూసూద్.
నేపాల్ వరద సహాయక చర్యల్లో సోనూ సూద్..
Standing here today at the Trishuli River, where the floods have left behind unimaginable loss..broken homes, broken families, and lives changed forever. Nepal is not alone. I stand with its people, and I will do everything I can to bring hope, rebuild homes, and help families… pic.twitter.com/oJi344srKZ
— sonu sood (@SonuSood) September 2, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.