యూత్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ‘డెలులు’ అనే పదాన్నే టైటిల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘డెలులు’. ప్రీతం కస్తూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మిస్తున్నారు. విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు అందించగా.. రెష్మిత్ ఎస్. కౌశిక స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. టైటిల్ నుంచే విభిన్నంగా అనిపిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ‘డెలులు’ మూవీ టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఒక నిమిషం 32 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్.. ‘బ్రేకప్ దేవా’ అనే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు, పాత్రల మధ్య జరిగే సరదా సంభాషణలు టీజర్‌కు మంచి ఫన్ టచ్‌ను తీసుకొచ్చాయి.
Jabardasth Komaram: జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే.. ఆ అన్న వల్లే ఇప్పుడు ఇదంతా
టీజర్‌లోని పలు డైలాగ్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఆడదానివైన నువ్వు.. చీప్‌గా ఓ మగాడి కోసం మారతావా అంటావా.. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నీకు’, ‘నువేమైనా ఫాదర్ ఆఫ్ ఇండియానా?’, ‘నువ్వు అత్తాపూర్‌కు రారా.. నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా’, ‘కుక్కకు పుట్టినవా నువ్వు’ వంటి డైలాగ్స్ టీజర్లో హైలైట్‌గా నిలిచాయి. ఈ డైలాగ్స్, కామెడీ సన్నివేశాలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఓ ఇంటి నేపథ్యంలో చోటుచేసుకునే సరదా సంఘటనలు, పాత్రల మధ్య కెమిస్ట్రీ టీజర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కామెడీతో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలకు కూడా సినిమాలో ప్రాధాన్యత ఇచ్చినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. మొత్తంగా టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌కు మంచి స్పందన రాగా.. తాజాగా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..
సాంకేతికంగా కూడా ‘డెలులు’కు మంచి బృందం పనిచేస్తోంది. జై రాజ్ నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. హరికృష్ణ కురపాటి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆది చెబ్రోలు సంగీతం అందిస్తున్నారు. టీజర్లో సంగీతం కూడా సన్నివేశాలకు తగ్గట్టుగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీ రామ మండవ, అభినయ్ తుల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువతను టార్గెట్ చేసే ఫన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంశాలతో ‘డెలులు’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. టీజర్‌కు వస్తున్న స్పందనతో ‘డెలులు’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. విభిన్నమైన టైటిల్, కామెడీతో కూడిన కథనం, ఫన్ ఎలిమెంట్స్ సినిమాకు ప్లస్‌గా మారే అవకాశముంది. మరి థియేటర్లలో ‘డెలులు’ ఏ స్థాయిలో నవ్వులు పూయిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.. రూ.25 కోట్లు పెడితే రూ.180 కోట్లు వచ్చాయి.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.