Headlines

Weight loss: మీ డైట్‌లో ఇదొక్కటి ఉంటే చాలు.. బాడీలోని కొవ్వు వెన్నలా కరిగిపోవాల్సిందే! | Curry Leaves for Weight Loss: Simple Ways to Add Them to Your Diet


బరువు తగ్గాలి, స్లిమ్‌గా కనిపించాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. ఇందుకో రకరకాల డైట్స్ ఫాలో అవుతున్నారు. కానీ మన బాడీలో కొవ్వును కరిగించి త్వరగా బరువు తగ్గేందుకు ఉపయోగపడే అదిరిపోయే ఔషదం ఒకటి మన ఇంటి ఆవరణలోనే ఉందని చాలా మందికి తెలియదు. అవును మనం కూరల్లో వాడే కరివేపాకుతో మనం ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు ఇవి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతాయి.

కరివేపాకును ఆహారంలోకి ఎలా చేర్చుకోవాలి

కరివేపాకును చాలా మంది కూరల్లో చేర్చుకుంటారు, కొందరు వేపుళ్లు, పచ్చళ్లలో రోజూ తగినంత కరివేపాకును యాడ్ చేసుకుంటారు. కానీ మీరు వీటితో టీని కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని కరివేపాకులను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. మీకు టెస్ట్ నచ్చకపోతే రుచి కోసం అందులో కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు.. ఇతర ఆహారంతో పాటు ఇది కూడా మీరు రోజువారి ఆహారంలో యాడ్ చేసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.

చాలా మంది పచ్చి కరివేపాకులను కూడా నేరుగా తింటారు. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో కొన్ని పచ్చి కరివేపాకులను నమిలి తింటుంటారు. అయితే ఇది అందరి శరీర తత్వానికి ఒకేలా సరిపడకపోవచ్చు. కాబట్టి అది తిన్నప్పుడు మీలో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే తినడం ఆపేయండి.

అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కరివేపాకు కేవలం బరువు తగ్గించే ప్రయాణంలో సహాయంగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఇదొక్కటే తీసుకుంటే పూర్తిగా బరువు తగ్గుతారని కాదు.. సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో పాటు ఇవి కూడా మీ రోజు వారి జీవనశైలిలో భాగమైతే సరైన ఫలితాలు కనిపిస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *