డిజిటల్ వరల్డ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘మీర్జాపూర్’ గ్యాంగ్.. ఇప్పుడు నేరుగా వెండితెర మీదకు వస్తోంది. ఎప్పుడూ మొబైల్స్‌లో, ల్యాప్‌టాప్‌లలో చూసిన ఈ గ్యాంగ్‌వార్‌ను సెప్టెంబర్ 4న బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నారు ఆడియన్స్. అయితే, ఓటీటీలో ఎలాంటి సెన్సార్ లేకుండా బోల్డ్ కంటెంట్‌తో స్ట్రీమ్ అయిన ఈ సిరీస్ థియేటర్లలోకి తెస్తుండటంతో.. సెన్సార్ బోర్డ్ ఏ రేంజ్‌లో కత్తెర వేస్తుందోనన్న టెన్షన్ ఫ్యాన్స్‌లో మొదలైంది. అసలు మీర్జాపూర్ మూవీకి సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ చెప్పింది..? ‘మీర్జాపూర్ ది మూవీ’కి సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. ఊహించినట్లుగానే ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. అంతేకాదు కొన్ని సీన్స్‌లో మార్పులు సూచించింది. ముఖ్యంగా సినిమాలో ఉన్న రెండు ఇంటిమేట్ సీన్స్‌ను 50 శాతం మేర తగ్గించాలని సూచించటంతో 35 సెకన్ల రొమాంటిక్ సీన్స్ కు కత్తెర పడింది. మీర్జాపూర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది బూతులు. అయితే థియేట్రికల్ వర్షన్‌లో ఆ డోస్ కాస్త తగ్గించినట్టున్నారు మేకర్స్. అందుకు కేవలం నాలుగు చోట్ల మాత్రమే డైలాగ్స్‌ను మ్యూట్ చేయాల్సి వచ్చింది. మరో ఆరు చోట్ల ఆ బూతుల స్థానంలో వేరే పదాలను మార్చేందుకు మూవీ టీమ్ ఓకే చెప్పింది. సినిమాలోని వైలెన్స్ విషయంలో సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా చెప్పలేదని తెలుస్తోంది. హింసకు ఏమాత్రం కత్తెర పడకపోవడంతో.. మీర్జాపూర్ ఒరిజినల్ ఫ్లేవర్, ఆ రా అండ్ రస్టిక్ యాక్షన్ సీన్స్ థియేటర్లలోనూ ఆడియన్స్‌ను అలరించబోతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. సెన్సార్ కారణంగా మీర్జాపూర్ ఫ్లేవర్ ఏ మాత్రం దెబ్బతినకుండా ముందు నుంచే జాగ్రత్తగా ప్లా్న్ చేసింది మూవీ టీమ్. ప్రజెంట్ బిగ్ స్క్రీన్ మీద లెంగ్తీ సినిమాల ట్రెండ్ నడుస్తుండటంతో 3 గంటల 17 నిమిషాల 19 సెకన్ల రన్‌టైమ్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. గురుమీత్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో వెబ్ సిరీస్‌లో నటించిన పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, జితేంద్ర కుమార్ లీడ్ రోల్స్‌లో కనిపించబోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sardar 2: విలన్‌గా విశ్వరూపం చూపిస్తున్న ఎస్.జె. సూర్య
Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. పగలు ఉక్కపోత.. రాత్రికి జల్లులు
OG Universe: OG యూనివర్స్.. అన్నీ చెప్పారు ఆ ఒక్కటి తప్ప..!