Headlines

Kalki 2: ఫౌజీ, స్పిరిట్ తర్వాతే కల్కి- 2 కి మోక్షం | Kalki 2 Delay: Prabhas’ Busy Schedule Pushes Nag Ashwin’s Epic Sequel Further, Only 10 Days of Shoot Completed video tv9d – Entertainment Videos in Telugu


పాన్ ఇండియా సీక్వెల్స్ కోసం అభిమానులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన భారీ సినిమాల సెకండ్ పార్ట్స్ విషయంలో ఈ డిలే మరింత భారీగా ఉంటోంది. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘కల్కి-2’ పరిస్థితి కూడా అలాగే మారుతోందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు ఈ ఆలస్యానికి కారణమేంటి..? 2024లో విడుదలై వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది ‘కల్కి 2898 ఏడీ’. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీకి సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే పార్ట్ 2 ఇప్పట్లో పూర్తి స్థాయిలో పట్టాలెక్కే పరిస్థితి కనిపించడంలేదు. మిగతా టీమ్ అంతా రెడీగా ఉన్నా.. రెబల్ స్టార్ ప్రభాస్ కాల్ షీట్స్ దొరకడం కష్టంగా మారడమే ఈ డిలేకి కారణం. రీసెంట్‌గా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఐ యామ్ గేమ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ కల్కి సీక్వెల్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది తనకు కూడా బర్నింగ్ క్వశ్చనే అంటూ నాగి నవ్వులు పూయించారు. ఇప్పటివరకు సీక్వెల్‌కు సంబంధించి కేవలం 10 రోజుల షూట్ మాత్రమే జరిగిందని, ప్రభాస్ ఫ్రీ అయితే ఒకేసారి లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ప్రజెంట్‌ ఫౌజీ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్న డార్లింగ్.. ఆ తర్వాత స్పిరిట్ షూటింగ్‌లో పాల్గొంటారు. స్పిరిట్‌తో పాటు ప్యారలల్‌గా కల్కి 2కి కూడా డేట్స్ అడ్జస్ట్ చేసే ఛాన్స్ ఉంది. గతంలో గ్రహాలన్నీ ఒకే లైన్‌లోకి వస్తే కల్కి షూట్ మొదలవుతుందని చెప్పిన నాగి.. ఇప్పుడు కూడా మరోసారి అదే డైలాగ్ చెప్పి ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజన్‌లో పడేశారు. పాన్ ఇండియా ట్రెండ్‌లో భారీ క్యాస్టింగ్, బల్క్ డేట్స్, భారీ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఒక్కో పార్ట్‌కి రెండు మూడేళ్ల గ్యాప్ తప్పట్లేదు. స్టార్ హీరోల బిజీ షెడ్యూల్స్ సీక్వెల్స్‌కు బ్రేకులు వేస్తున్నాయి. మరి ప్రభాస్ డైరీ ఫ్రీ అయ్యి, కల్కి-2 కోసం నాగ్ అశ్విన్‌కు ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పడేది ఎప్పుడో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mirzapur: డిజిటల్లో బిగ్ హిట్ అయిన మీర్జాపూర్ ఇప్పుడు థియేటర్లలోకి

Sardar 2: విలన్‌గా విశ్వరూపం చూపిస్తున్న ఎస్.జె. సూర్య

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. పగలు ఉక్కపోత.. రాత్రికి జల్లులు

OG Universe: OG యూనివర్స్.. అన్నీ చెప్పారు ఆ ఒక్కటి తప్ప..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *