Headlines

చంద్రుడు, అంగారకుడిపై ఇల్లు ఎలా? భవిష్యత్‌ దారి చూపించిన శుభాన్షు శుక్లా! | Indian Astronaut Shubhanshu Shukla Designs ‘BHEEM’ Space Habitat for Humans to Live on Moon and Mars video tv9d – Technology Videos in Telugu


భూమి నుంచి చంద్రుడిపైకి.. అక్కడి నుంచి అంగారకుడిపైకి మనిషి అడుగులు వేయాలని చూస్తున్నాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఎక్కడ నివసించాలి? ఎలా బతకాలి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేశారు భారత వ్యోమగామి గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా. భూమికి ఆవల మనుషులు నివసించేందుకు వీలుగా ‘భారతీయ హ్యాబిటబుల్‌ ఎక్స్‌పాండబుల్‌ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్‌ హ్యాబిటాట్‌’ అనే కాన్సెప్ట్‌ను ఆయన రూపొందించారు. రష్యాలో శిక్షణ ముగించుకుని భారత్‌కు తిరిగొచ్చిన ఆయన, బెంగళూరులోని ఐఐఎస్సీ ‘అలోక్ ల్యాబ్’ వేదికగా ఈ పరిశోధన పూర్తి చేశారు. అంతరిక్షంలో తీవ్రమైన రేడియేషన్, విపరీతమైన ఉష్ణోగ్రతల నుంచి వ్యోమగాములను రక్షించడంతో పాటు, గాలి, నీరు, విద్యుత్ వంటి నిరంతర వసతులు కల్పించేలా ఈ నివాస నమూనాను డిజైన్ చేశారు. మరో 20 ఏళ్లలో అంతరిక్షంలో నివసించాలంటే ఇప్పుడే అడుగులు వేయాలని ఆయన పేర్కొన్నారు. ‘భీమ్’ అనేది తేలికైన ప్యానళ్లతో తయారయ్యే మాడ్యులర్ అంతరిక్ష నివాసం. చంద్రుడు, అంగారక గ్రహాలపై వ్యోమగాముల రోజువారీ అవసరాలను అధ్యయనం చేసి దీనిని తయారు చేశారు. త్రిభుజం, చతురస్రం, పంచభుజం వంటి సాధారణ ఆకారాల ప్యానళ్లను కలిపి ఈ మాడ్యూళ్లను నిర్మించవచ్చు. తక్కువ బరువు ఉండే ఈ నిర్మాణాలను రాకెట్‌లో సులభంగా తీసుకెళ్లి అమర్చవచ్చు. అంతేకాకుండా అవసరానికి తగినట్లుగా నివాసాన్ని సులభంగా విస్తరించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ మొత్తం నిర్మాణాన్ని స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ ఒక్కసారిగా అంతరిక్షానికి చేర్చగలదని, ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కంటే రెండింతల విశాలమైన స్థలాన్ని ఇస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తమిళ సినిమా కోసం.. లైఫ్ ని రిస్క్ లో పెట్టాడు..

‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు రిలీజ్‌కు పెద్ద అడ్డంకి

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే..!

భారతీయులకు అమెరికా మరో షాక్.. గ్రీన్ కార్డ్ కోటా ఖతం!

వైకల్యాన్ని జయించి మద్రాస్‌ ఐఐటీలో సీటు సాధించి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *