Headlines

Indian Railways: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. మరో ప్రత్యేక రైలు వచ్చేసింది.. ఈ ప్రాంతాల మీదుగా.. | Tirumala Pilgrims Alert: Indian Railways Announces Special Weekend Trains from Machilipatnam & Guntur, Check Timings and Stops


తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే తిరుమలకు వివిధ ప్రాంతాల నుంచి అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. ఇప్పుడు మరో రైలును అందుబాటులోకి తెచ్చింది. భక్తుల రద్దీ దృష్ట్యా మరో ప్రత్యేక రైలును ప్రవేశపెట్టింది. ఈ రైలు మచిలీపట్నం-తిరుచానూరు(07440/07439) మధ్య సర్వీసులు అందించనుంది. ఈ స్పెషల్ ట్రైన్ ప్రతీవారం వీకెండ్స్‌లో అందుబాటులో ఉంటాయి. మచిలీపట్నం-తిరుచానూరు రైలు శుక్రవారం, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఇక తిరుచానూరు-మచిలీపట్నం రైలు శనివారం, ఆదివారం సర్వీసులు అందించనుంది. తిరుమల వెళ్లే భక్తులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడనుందని చెప్పవచ్చు. ఈ రైలు టైమ్ షెడ్యూల్ వివరాలు తెలుసుకుందాం.

షెడ్యూల్ ఇదే..

మచిలీపట్నం-తిరుచానూరు(07440) ట్రైన్ మచిలీపట్నంలో సాయంత్రం 4.55 గంటలకు ప్రారంభమవుతుంది. గుడివాడకు 5.23 గంటలకు, విజయవాడకు 6.20 గంటలకు చేరుకుంటుంది. ఆ తర్వాత తెనాలికి 7 గంటలకు, చీరాలకు 7.48 గంటలకు, ఒంగోలుకు 8.48 గంటలకు, నెల్లూరుకు 10.28 గంటలకు, రేణిగుంటకు అర్థరాత్రి 1 గంటలకు చేరుకోనుండగా.. తిరుచానూరుకు 2 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుచానూరు-మచిలీపట్నం ట్రైన్(07439) రైలు తిరుచానూరులో ఉదయం 3.30 గంటలకు బయల్దేరుతుండగా..విజయవాడకు 11 గంటలకు చేరుకుంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు మచిలీపట్నంకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

గుంటూరు-చర్లపల్లి ప్రత్యేక రైలు..

అటు గుంటూరు-చర్లపల్లి(07227/07228) స్పెషల్ రైలు కూడా ప్రకటించారు. ఇది ప్రతీ ఆదివారం సర్వీసులు అందించనుంది. గుంటూరు-చర్లపల్లి(07227) ట్రైన్ ఆదివారం రాత్రి గుంటూరులో రాత్రి 9.45 గంటలకు బయల్దేరి..చర్లపల్లికి ఉదయం 4 గంటలకు చేరుకుంటుంది. ఇక చర్లపల్లి-గుంటూరు(07228) ట్రైన్ ప్రతీ సోమవారం చర్లపల్లిలో రాత్రి 11.50 గంటలకు బయల్దేరి.. గుంటూరుకు ఉదయం 6.10 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్లలో ఆగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *