Headlines

School Holiday: 11న స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కారణం ఇదే! | Delhi govt declares holiday for schools, offices on Sep 11 for BRICS Summit


School Holiday: పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు ఎగిరిగంతులేస్తారు. ఇక సెప్టెంబర్‌ 11వ తేదీన విద్యార్థులకు సెలవు రానుంది. అయితే ఇది తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అనుకుంటే పొరపాటే. న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సు కారణంగా ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఢిల్లీలోని పాఠశాలలు, విద్యాశాఖ పరిధిలోని కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.

ఢిల్లీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సెప్టెంబర్‌ 5న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్‌పాఠశాలలు సహా విద్యాశాఖ పరిధిలోని అన్ని పాఠశాలలు సెప్టెంబర్‌ 11న సెలవు ప్రకటించింది ప్రభుత్వం. అలాగే విద్యాశాఖకు చెందిన కార్యాలయాలు కూడా ఆ రోజు పనిచేయవు.

18వ బ్రిక్స్‌ లీడర్స్‌ సమ్మిట్‌ సెప్టెంబర్‌ 11 నుంచి 13 వరకు న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో జరగనుంది. ఈ సదస్సుకు పలువురు దేశాధినేతలు, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. దీంతో ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనాల రాకపోకలపై నియంత్రణలు ఉండనున్నాయి.

ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు..

ఈ సదస్సుకు విదేశీ ప్రముఖుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్ల కారణంగా రాజధానిలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

ఇది కూడా చదవండి: Basement Construction: కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పునాది లెవల్‌ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

ఇది కూడా చదవండి: Gold Price: రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి 5 కారణాలు.. అవేంటో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *