Headlines

కుండీలో పెంచుకునే ఆకు కూర.. వారానికి రెండుసార్లు తింటే కంటి పవర్ సూపర్.. పెద్ద రోగాలు మాయం.. | Spinach Benefits: Why Eating Spinach Twice a Week May Support Eye, Bone and Heart Health Palakura


మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం అత్యవసరం. వైద్య నిపుణులు, డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం.. సమతుల్య ఆహారంలో ఆకుకూరలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో పాలకూర ఎంతో ప్రత్యేకమైనది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు పాలకూర తీసుకోవడం ద్వారా పెద్ద రోగాలను సైతం నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాలకూర పిల్లలకు, పెద్దలకు అవసరమైన పోషకాలను, శక్తిని అందిస్తుంది. దీన్ని మీ ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి విలువైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి సమగ్ర ఆరోగ్యాన్ని అందిస్తాయి.

కంటి ఆరోగ్యానికి:

పాలకూరలో ఉండే విటమిన్ ఏ కంటిచూపును గణనీయంగా మెరుగుపరుస్తుంది. వయసు మీదపడటం వల్ల వచ్చే శుక్లాలు, ఇతర కంటి సమస్యలను నివారించడంలో ఇది సహాయపడుతుంది. నిత్యం పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా నేత్ర సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇందులో ఉండే కెరోటినాయిడ్స్, జియాక్సాంథిన్ విటమిన్ ఏ ఉత్పత్తికి దోహదపడి కంటి ఆరోగ్యానికి మరింత మద్దతునిస్తాయి.

మెదడు పనితీరుకు:

పాలకూర మెదడుకు అవసరమైన చక్కని ఆహారం. ఇది ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఏ, విటమిన్ సి వంటి ఖనిజాలతో పాటు అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఈ పోషకాలు మీ జ్ఞాపకశక్తిని, మొత్తం జ్ఞానశక్తిని మెరుగుపరుస్తాయి.

జీర్ణక్రియ – మలబద్ధకం నివారణ:

పాలకూరలో కరగని పీచుపదార్థం (insoluble fibre) చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పీచుపదార్థం మలబద్ధకం సమస్యను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. జీర్ణక్రియను సులభతరం చేసి, ప్రేగు కదలికలను క్రమబద్ధీకరిస్తుంది.

క్యాన్సర్ నివారణ:

పాలకూరలో జియాక్సాంథిన్, కెరోటినాయిడ్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు క్యాన్సర్ నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి అధిక శాతం కారణంగా శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడంలో పాలకూర ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మధుమేహం నియంత్రణ:

పాలకూరలో ఆల్ఫా లిపోయిక్ యాసిడ్, ఫైబర్ కంటెంట్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఫుడ్ తీసుకున్న తర్వాత ఇన్సులిన్ రక్తం నుండి కణాలకు చక్కెరను చేరవేయడాన్ని ఈ యాసిడ్ నియంత్రిస్తుంది. తద్వారా చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఎముకల ఆరోగ్యం:

పాలకూరలో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ కె ఎముకలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాల్షియం మరియు మెగ్నీషియం కూడా ఎముక సాంద్రతను పెంచి, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

బరువు తగ్గడానికి – రక్తపోటు నియంత్రణకు:

పాలకూరలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వలన కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ కాలం పాటు ఇస్తుంది. త్వరగా బరువు తగ్గాలని కోరుకునే వారికి ఇది చాలా మంచిది. ఇందులో ఉండే మెగ్నీషియం, విటమిన్ సి రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచేందుకు సహాయపడతాయి. అలాగే, ఫోలేట్ హృద్రోగ సమస్యలు రాకుండా నివారిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

వాపులు – రోగనిరోధక శక్తి:

పాలకూరలో రోగనిరోధక సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలో వచ్చే వాపులను నివారించి, వాటికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. మైగ్రేన్, తలనొప్పి వంటి ఇన్ఫ్లమేటరీ సమస్యలను తగ్గించడంలో కూడా పాలకూర ప్రయోజనకరంగా ఉంటుంది.

సమగ్ర ఆరోగ్యం కోసం పాలకూరను ఏదో ఒక రూపంలో, కేవలం పప్పులో కాకుండా ఇతర రకాల కూరల్లో, సలాడ్లలో భాగం చేసుకుని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఈ విధంగా పాలకూరను వినియోగించడం ద్వారా అన్ని రకాల పోషకాలను పొంది ఆరోగ్యంగా జీవించవచ్చు.. అయితే.. ఏదైనా సమస్యతో బాధపడుతుంటే ముందుగా వైద్య నిపుణులను సంప్రదించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *