Headlines

నోరు జారిన ముద్దుగుమ్మ.. రూ. 3 కోట్ల లాస్..! క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్నారుగా.. | Aviation Company files Rs 3 crore defamation suit against Actress Nora Fatehi for referring to their aircraft as toy plane


కొన్నిసార్లు హీరోయిన్ చేసే వ్యాఖ్యలు వారి కొంపముంచుతుంటాయి. తెలిసి తెలియక చేసే కామెంట్స్‌తో ట్రోల్స్ బారిన పడుతుంటారు చాలా మంది. ఆతర్వాత సోషల్ మీడియాలో తమ పై వచ్చిన ట్రోల్స్ తర్వాత చాలా మంది క్షమాపణలు చెప్పడం, వివరణ ఇవ్వడంలాంటివి చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ నోరు జారీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకు ఊహించని షాక్ తగిలేలా చేశాయి. ఏమగా రూ. 3 కోట్ల దావా వేశారు ఆమె మీద. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో కాదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది నోరా ఫతేహి. నోరా ఫతేహికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు ఈ అమ్మడు. నోరా ఫతేహి ఎక్కడ ఉన్నా ఆ వైబ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది.

ఎన్టీఆర్, పవన్, మహేష్‌లతో ఆడిపాడింది.. కట్ చేస్తే ఇప్పుడు కనిపించకుండాపోయింది.

ప్రస్తుతం సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్, స్టేజ్ పర్ఫామెన్స్ లు చేస్తూ సందడి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే తాజాగా నోరా నోరుజారి చేసిన కొన్ని వ్ వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి. దాంతో ఆమె పై దావా వేశారు. ఇంతకూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా.? ఓ చార్టెడ్ విమానం గురించి ఓ వీడియో రికార్డ్ చేసి అది బొమ్మలా ఉంది అంటూ కామెంట్స్ చేసింది. ఆతర్వాత ఇది సేఫ్ గా ఉంటుందా.? ఇందులో ప్రయాణించొచ్చా అంటూ సరదగా వీడియో రికార్డ్ చేసింది. ఆవీడియోను తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి



అలాంటి సినిమాలు ఆడవు అన్నారు.. కానీ నా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది: దుల్కర్ సల్మాన్

అయితే డ్యూన్స్ ఏవియేషన్ కు చెందిన ఓ విమానంలో నోరా ఫతేహి ప్రయాణించాల్సి వచ్చింది. అయితే ఆ విమానం చూసి  బొమ్మ విమానంలా ఉంది, చిన్నగా ఉంది అంటూ ఎగతాళి చేస్తూ ఓ వీడియోను రికార్డ్ చేసింది. దాని సోషల్ మీడియాలో షేర్ చేసింది నోరా. ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఆమె విమానాన్ని ఎగతాళి చేస్తూ ఆ చేసిన వీడియో వల్ల తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీశాయని, తద్వారా బుకింగ్‌లలో 15–20 శాతం తగ్గుదల ఏర్పడిందని డ్యూన్స్ ఏవియేషన్ ఆరోపించింది. దాంతో నోరా ఫతేహిపై రూ. 3 కోట్ల దావా వేశారు. రూ.3 కోట్ల పరిహారంతో పాటు, ఆ పోస్టులను తొలగించాలని అలాగే నోరా ఫతేహి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది డ్యూన్స్ ఏవియేషన్.

Prabhas Sreenu: ఆ హీరో ఎవ్వరికీ రికమెండ్ చేయడు.. చాలా మొహమాటస్తుడు : ప్రభాస్ శ్రీను

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *