Headlines

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు శుభవార్త.. అదేంటో తెలుసా..? | HDFC Bank Reduced 10 Bps From Its MCLR : Know What It Is All About


HDFC బ్యాంక్ తన వినియోగదారులకు ఒక శుభవార్తను ప్రకటించింది. అదేమిటంటే తన MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్స్) ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. MCLR ఆధారంగా రుణాలు తీసుకున్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సవరించిన వడ్డీ రేటు సెప్టెంబర్ 07, 2026 నుండి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్ చేసిన ఈ ముఖ్యమైన మార్పును తెలుసుకుందాం.

HDFC బ్యాంక్ MCLR శాతాన్ని తగ్గించింది:

బేసిస్ పాయింట్ అనేది శాతంలో ఒక భాగం. అంటే 100 బేసిస్ పాయింట్లు కలిపితే ఒక శాతం అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్లలో మార్పు కారణంగా ప్రస్తుత ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేటు 7.90 శాతం నుండి 8.60 శాతానికి పెరిగింది. ఇది ఇంతకుముందు 8 శాతం నుండి 8.65 శాతంగా ఉండేది.

MCLR అంటే ఏమిటి?

MCLR అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్. అనేది ఒక బ్యాంకు రుణంపై వసూలు చేయగల కనీస రేటు. ఇది వడ్డీ రేట్లకు ఒక దిగువ పరిమితిని నిర్దేశిస్తుంది. తద్వారా ఆర్‌బిఐ ఆమోదం పొందితే తప్ప, రుణగ్రహీతల నుండి ఒక నిర్దిష్ట పరిమితి కంటే తక్కువ రేట్లు వసూలు చేయకుండా ఇది నిర్ధారిస్తుంది.

బ్యాంక్ సెప్టెంబర్ MCLR రేటు:

  • హెచ్‌డీఎఫ్‌సీ ఒక నెల MCLR రేటును 8 శాతం నుండి 7.90 శాతానికి తగ్గించారు.
  • మూడు నెలల కాలానికి ఎంసీఎల్ఆర్ రేటు 8.15 శాతం నుంచి 8.05 శాతానికి తగ్గింది.
  • ఆరు నెలల కాలంలో ఎంసీఎల్ఆర్ రేటు 8.30 శాతం నుంచి 8.25 శాతానికి తగ్గింది.
  • ఒక సంవత్సరపు MCLR రేటు 8.40 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గింది.
  • రెండు సంవత్సరాల కాలానికి ఎంసీఎల్ఆర్ రేటు 8.55 శాతం నుంచి 8.45 శాతానికి తగ్గింది.
  • మూడేళ్ల కాలపరిమితికి ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.65 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గింది.

MCLR అంటే ఏమిటి?

ఎంసీఎల్‌ఆర్‌ అంటే కనీస రుణ రేటు. దీనిని 2016లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టింది. ఈ నిబంధనతో ముడిపడి ఉన్న రుణాల వడ్డీ రేట్లు, వడ్డీ రేటులో మార్పుకు అనుగుణంగా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *