Headlines

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. సూర్య 250 కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే | Vishwanath And Sons OTT release date announced officially, When and where to watch the Suriya’s family entertainer


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. ఓవరాల్ గా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హీరో సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూర్య నటన, మమితా బైజు అల్లరి, రాధిక, రవీనా టాండన్ ల అభినయం, డైరెక్టర్ వెంకీ అట్లూరి టేకింగ్, అలాగే జీవీ ప్రకాశ్ కుమార్ పాటలు, ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇలా ఈ సినిమాలో హైలైట్ అయిన అంశాలు చాలానే ఉన్నాయి. తమిళం, తెలుగు భాషల్లోనూ ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం (సెప్టెంబర్ 11) నుంచే సూర్య ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘మీట్ సంజయ్ విశ్వనాథ్.. అథ్లెట్, బిలియనీర్, ఫిలాంత్రోపిస్ట్ అండ్ లవింగ్ ఫాదర్’ అంటూ విశ్వనాథ్ అండ్ సన్స్ స్ట్రీమింగ్ డేట్ ను రివీల్ చేసింది. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, హిందీ, మలయాళం భాషల్లోనూ సూర్య సినిమా స్ట్రీమింగ్ కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను నిర్మించారు. నాజర్, సునీల్ రెడ్డి, రాజీవ్ మేనన్, హర్ష చెముడు, కాళి వెంకట్, దీపా శంకర్, హైపర్ ఆది, మైమ్ గోపి, సర్వదమన్ బెనర్జీ తదితరులు వివిధ పాత్రల్లో కనిపించారు. మరి థియేటర్లలో ‘విశ్వనాథం అండ్ సన్స్’ సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే మూడు రోజులు ఆగండి.. ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి



నెట్ ఫ్లిక్స్ లో సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్..

 విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *