Headlines

చిన్న సమస్య.. దేశ వ్యాప్తంగా 1000కిపై విమానాలు రద్దు! ఎయిర్‌పోర్టులలో ప్రయాణికులు పడిగాపులు! | Over 1,000 Flights Cancelled Across UK Due to Air Traffic Control Technical Glitch


బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశ వ్యాప్తంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతయారం ఏర్పడింది. బ్రిటిష్ గగనతలం తెరిచి ఉన్నప్పటికీ ఈ సాంకేతిక సమస్య కారణంగా ఆ దేశం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో కేవలం మంగళవారం ఒక్క రోజే బ్రిటన్ వ్యాప్తంగా సుమారు 1,000కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (NATS) ప్రాబ్లమ్ ఏంటని చెక్‌ చేయగా.. ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ప్రాబ్లమ్ వచ్చినట్టు గుర్తించారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను సాల్వ్ చేసి విమాన సర్వీసులను ప్రారంభిస్తామన్నారు.

ఈ సాంకేతిక సమస్య కారణంగా బ్రిటన్ గగనతలం తెరిచే ఉన్నప్పటికీ, లండన్ హీత్రూ, గాట్విక్, ఎడిన్‌బర్గ్, డబ్లిన్, లుటన్, బర్మింగ్‌హామ్, అబెర్డీన్, గ్లాస్గో వంటి 15కు పైగా ప్రధాన విమానాశ్రయాల్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ కారణంగా హీత్రూలో ఎయిర్‌పోర్టులో సుమారు 100 విమానాలు రద్దు కాగా, 367 విమానాలు లేట్‌గా బయల్దేరనున్నాయి. ఇక గాట్విక్‌ ఎయిర్‌పోర్టులో దాదాపు 250 విమానాలు ఆలస్యంగా వెళ్తున్నాయి. ఇక ఎయిర్ లైన్స్ వారిగా చూసుకుంటే.. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన 96 విమానాలు రద్దు కాగా ఈజీజెట్ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన 92 రద్దయ్యాయి. అలాగే కేఎల్‌ఎం ఎయిలైన్స్‌కు చెందిన 20, లుఫ్తాన్సాను చెందిన 12, స్విస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 11 విమానాలు రద్దయ్యాయి.

ఎయిర్ ఇండియా ప్రకటన

ఈ సాంకేతిక సమస్య కారణంగా ఎరిండియా కీలక ప్రకటన చేసింది. యూకే మీదుగా రాకపోకలు సాగించే విమానాల్లో పలు సర్వీసులను దారి మళ్లించినట్టు, మరి కొన్ని ఆలస్యంగా రాకపోకలు సాగించనున్నట్టు పేర్కొంది. విమానాలు, సిబ్బంది ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోవడం వల్ల తదుపరి సర్వీసులపై కూడా ప్రభావం పడిందని తెలిపింది.

అయితే బ్రిటన్ ఎయిర్‌ కంట్రోల్‌ వ్యవస్థలో ఇలా సాంకేతిక సమస్య రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2023, 2024లలో కూడా ఇక్కడ ఇటువంటి సమస్యలు తలెత్తి విమానయాన రంగానికి సుమారు 100 మిలియన్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *