Naman Dhir Century: మొహాలీలో జరిగిన షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో నమన్ ధీర్ బ్యాట్‌కు తిరుగులేకుండా పోయింది. అమృత్‌సర్ సూర్మాస్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన అతడు కేవలం 64 బంతుల్లో 173 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి దూకుడైన ఇన్నింగ్స్‌తో అమృత్‌సర్ సూర్మాస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 279 పరుగుల భారీ స్కోరు సాధించింది. నమన ధీర్ తన సెంచరీని కేవలం 37 బంతుల్లో పూర్తి చేశాడు. ఈ టోర్నీలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీగా నిలిచింది. సెంచరీ తర్వాత కూడా అతడి వేగం ఏమాత్రం తగ్గలేదు. మొత్తం ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 12 సిక్సర్లు బాదాడు. అంటే బౌండరీల ద్వారానే 136 పరుగులు సాధించడం అతడి హిట్టింగ్ సామర్థ్యాన్ని స్పష్టం చేసింది.
ఆరంభంలో ఎదురుదెబ్బ..
అమృత్‌సర్ సూర్మాస్ ఇన్నింగ్స్‌కు మంచి ఆరంభం రాలేదు. సహజ్ ధావన్, రాహుల్ కుమార్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన నమన్ ధీర్ ఇన్నింగ్స్‌ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ వేగంగా పరుగులు రాబట్టడంతో జట్టు స్కోరు ఒక్కసారిగా పుంజుకుంది.
కలిసొచ్చిన ఐపీఎల్ అనుభవం..
🥶 NAMAN DHIR SHOW IN THE SHER-E-PUNJAB T20 LEAGUE! 🔥
Naman smashed 100 runs from just 37 balls 🥵🥵
Absolute carnage from Naman Dhir! 🥵🏏#NamanDhir #SherEPunjabT20League pic.twitter.com/NPGyE3AVtO
— ʀ ᴜ ᴋ ᴍ ɪ ɴ ɪ ᶠᵃⁿ (@rukmini_fan) September 8, 2026
నమన ధీర్‌కు IPLలో ఆడిన అనుభవం ఉంది. 2024లో అతడు ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. 2025, 2026 సీజన్లలోనూ ముంబై ఇండియన్స్‌లో కొనసాగాడు. ఇప్పటివరకు IPLలో 37 మ్యాచ్‌లు ఆడిన ధీర్ 3 హాఫ్ సెంచరీలతో 710 పరుగులు సాధించాడు. ఆ అనుభవం షేర్-ఎ-పంజాబ్ టీ20లో అతడి బ్యాటింగ్‌లో కనిపించింది.
భారీ స్కోరుతో అమృత్‌సర్..
మొహాలీ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అమృత్‌సర్ సూర్మాస్ 20 ఓవర్లలో 279/3కి చేరింది. ఆ స్కోరులో నమన్ ధీర్ చేసిన 173 పరుగులే అత్యంత కీలకంగా మారాయి. 64 బంతుల్లో 173 పరుగులు, 16 ఫోర్లు, 12 సిక్సర్లతో అతడు ఆడిన ఈ ఇన్నింగ్స్ షేర్-ఎ-పంజాబ్ టీ20లో గుర్తుండిపోయే ప్రదర్శనగా నిలిచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..