Headlines

Venus Transit: ఈ రాశులపై శుక్రుడి సిరిసంపదల వర్షం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..? | Venus Transit in Libra: 6 Zodiac Signs Set for a New Phase of Prosperity


భోగభాగ్యాలకు, సిరిసంపదలకు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్ర గ్రహం ప్రస్తుతం తన స్వస్థానమైన తులా రాశిలో జనవరి 2 వరకు సంచారం చేయడం జరుగుతోంది. ఈ రాశిలో శుక్రుడికి బాగా బలం పెరిగి స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఫలితాలనివ్వడం జరుగుతుంది. అయితే, భోగభాగ్యాలను ఇవ్వడంలో సాధారణంగా శుక్రుడు తనకు అనుకూలమైన, ఇష్టమైన రాశులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. శుక్రుడికి బాగా ఇష్టమైన రాశులుః వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభం. తులా రాశి నుంచి వృశ్చిక రాశిలో ప్రవేశించే లోగా శుక్రుడు ఈ రాశుల వారికి తప్పకుండా కొత్త జీవితాన్ని ప్రసాదించే అవకాశం ఉంది.

వృషభం

ఈ రాశికి శుక్రుడు షష్ట స్థానంలో ఉన్నప్పటికీ, ఈ రాశికి అధిపతి అయినందువల్ల శుక్రుడు ఈ రాశివారికి అంచనాలకు మించి సిరిసంపదలను అనుగ్రహించడం జరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. విలాస జీవితాన్ని అనుభవిస్తారు. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవు తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అనూహ్యంగా వృద్ది చెందుతాయి.

మిథునం

ఈ రాశికి పంచమ స్థానంలో పంచమ స్థానాధిపతి శుక్రుడి స్వస్థాన సంచారం ఈ రాశివారికి తప్పకుండా అదృష్టాన్ని కలగజేస్తుంది. ఆకస్మిక ధనలాభానికి, ఒకటి రెండు ధన యోగాలకు అవ కాశం ఉంది. విదేశీ సంపాదనకు అవకాశం లభిస్తుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి, సంపద కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, వడ్డీ వ్యాపారాలు వంటివి అంచనాలకు మించిన లాభాలని స్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంతాన యోగానికి అవకాశంఉంది.

ఇవి కూడా చదవండి



కన్య

ఈ రాశికి ధన స్థానంలో ప్రవేశించిన ధనాధిపతి శుక్రుడు ఈ రాశివారికి తప్పకుండా ఆదాయాన్ని వృద్ధి చేయడం జరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవనశైలి మారిపోతుంది. విలాస జీవితం అలవడుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. విదేశీ సంపాదనను అనుభవించే యోగం కలుగుతుంది. అనారోగ్యం నుంచి కోలుకోవడం జరుగుతుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.

తుల

ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల పూర్తి స్థాయిలో భోగ భాగ్యాలను అనుభవించడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. మనసులోని కోరికలు చాలావరకు నెర వేరుతాయి. సొంత ఇంటి కలతో పాటు, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల కూడా ఫలిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో అంచనాలకు మించి ఆదాయం బాగా పెరుగుతుంది.

మకరం

ఈ రాశికి దశమ స్థానంలో ప్రవేశిస్తున్న శుక్రుడు ఈ రాశివారిని తప్పకుండా ఉద్యోగంలో అంద లాలు ఎక్కించడం, జీతభత్యాలు పెంచడం జరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. విదే శాల్లో ఉద్యోగం లభించడం లేదా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. తల్లితండ్రుల వైపు నంచి సిరిసంపదలను లభిస్తాయి. కుటుంబంలో సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగ స్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

కుంభం

ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి శుక్రుడి సంచారంవల్ల ఈ రాశివారికి ధన యోగాలతో పాటు రాజయోగాలు కూడా కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *